Nosebleed: వేసవిలో ముక్కు నుంచి రక్తం కారితే ఏం చేయాలో తెలుసా?

Nosebleed: చాలామందికి వేసవికాలంలో ముక్కు నుంచి రక్తం కారుతూ ఉంటుంది. వేసవితో పాటు ఇతర కాలంలో కూడా ఇలా జరిగిన కూడా ఎక్కువ శాతం మందికి వేసవిలోనే ఇలా ముక్కు నుంచి రక్తం కారుతూ ఉంటుంది. చాలామంది ముక్కు నుంచి రక్తం వచ్చినప్పుడు ముక్కు బెదిరింది. శరీరంలో వేడి ఎక్కువగా ఉంది కాఫీలు టీలు తగ్గించండి అని చెబుతూ ఉంటారు. కానీ అసలు వేసవికాలంలో ముక్కు నుండి ఎందుకు రక్తం కారుతుంది. దాని వెనక కారణాలు ఏంటి? ముక్కు నుండి రక్తం కారకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అయితే వేసవికాలంలో ముక్కు నుండి రక్తం ఎందుకు కారుతుంది? అన్న విషయానికి వస్తే..

ఎండాకాలంలో ముక్కు నుండి రక్తం కారడానికి ప్రధాన కారణం పర్యావరణంలోని వేడి, పొడి గాలి. వేసవిలో గాలి పొడిగా ఉండటంతో పాటు వేడిగా ఉంటుంది. దీని వల్ల నాసల్ ప్యాసెజెస్ పొడిగా, చికాకుగా మారతాయి. ఇలా పొడిబారడం వల్ల ముక్కులోని సున్నితమైన పొరలో పగుళ్లు ఏర్పడి, రక్తనాళాలు సులువుగా చీలిపోయి ముక్కు నుండి రక్తం కారుతుంది. ఎండలో, వేడిలో ఆరు బయట సమయం గడపడం వల్ల డీహైడ్రేషన్ కు గురవుతారు. ఇది నాసల్ ప్యాసెజెస్ ను పొడిబారేలా చేస్తుంది. ముక్కు నుండి రక్తం కారడానికి కారణాలను ప్రేరేపిస్తుంది.

 

అయితే మరి ముక్కు నుంచి రక్తం కారకుండా ఏం చేయాలి అందుకోసం ఎటువంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. వేసవికాలంలో ముక్కు నుండి రక్తం కారడాన్ని ఆపడానికి ముక్కును తేమగా ఉంచడం కీలకం. సెలైన్ నాసల్ స్ప్రే లేదా హ్యూమిడిఫైయర్ లను ఉపయోగించి ముక్కును తేమగా ఉంచుకోవాలి. సెలైన్ నాసల్ స్ప్రేలు బయట మార్కెట్లలో దొరుకుతాయి. రోజులో అప్పుడప్పుడు సెలైన్ స్ప్రే ద్వారా ముక్కును తేమగా ఉంచుకోవచ్చు. హ్యూమిడిఫైయర్ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పొడి గాలి వీస్తున్న సమయంలో వీటిని వాడటం మంచిది. అలాగే డీహైడ్రేషన్ వల్ల ముక్కు పుటాలు పొడిగా మారతాయి. దీని వల్ల ముక్కు నుండి రక్తం కారుతుంది. హైడ్రేటెడ్ గా ఉండటానికి రోజంతా పుష్కలంగా నీరు తాగాలి. నీటితో పాటు పుచ్చకాయ, కీరదోస వంటి పండ్లు తీసుకోవడం వల్ల హైడ్రేటెడ్ గా ఉండవచ్చు. అలాగే ఆల్కహాల్ తీసుకోవడం పరిమితం చేయాలి, కెఫిన్ డ్రింకులు తాగొద్దు. సాల్టీ ఫుడ్స్ కు దూరంగా ఉండాలి. అలాగే సిగరెట్ పొగ, కాలుష్యం, శుభ్రపరిచే రసాయనాల వంటివి ముక్కు పుటాలను చికాకు కలిగిస్తాయి. ముక్కు నుండి రక్తం కారడానికి సంభావ్యతను పెంచుతాయి. అలాంటి వాటికి దూరంగా ఉండటం మంచిది. లేదంటే మాస్కు ధరించడం అలవాటు చేసుకోవడం మంచిది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -