Naraghosha: నరఘోష పోవాలంటే ఏం చేయాలో తెలుసా?

Naraghosha: నరదృష్టి లేదా నరఘోష ఈ పేర్లను మనం సాధారణంగా వింటూ ఉంటాం. ఈ నరఘోష తగిలింది అంతే ఎంతటి వారైనా కూడా చెమ్మగిల్లాల్సిందే. నరఘోష అంటే నెగిటివ్ ఎనర్జీ. నరఘోష దెబ్బకు మంచి మంచి వారు కూడా దారుణమైన దుస్థితికి చేరుకోవాల్సి వస్తుంది. మరి నరఘోష ఉన్నప్పుడు ఏం చేయాలి ఆ నరఘోష ఎలా వదిలించుకోవాలి అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ప్రతిరోజు మీ గృహంలో ప్రాతఃకాలంలో స్నానం ఆచరించి తర్వాత దేవుడి గదిలో ఘంటానాదం చేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.

అంటే ఆ గృహంలో ఉన్న చెడు అంతా బయటికి పోయి మంచి అనేది ఉంటుంది. అలాగే నరఘోష కోసం ఎనిమిది చిన్న తెల్ల గవ్వలను దేవుడి గదిలో చిన్న రాగి పాత్రలోగాని ఇత్తడి పాత్రలోగాని పెట్టుకోవాలి. ఆ ఎనిమిది గవ్వలకు గంధం, కుంకుమ పెట్టాలి. ఆ గవ్వలకి ప్రతిరోజు దీపం వెలిగించి చూపించాలి. అగరవత్తులు హారతి చూపించాలి. దేవుడి గదిలో దేవుడితో పాటు ఆ గవ్వలకు కూడా పుష్ప అలంకరణ, మారేడు దళం, తులసి దళం పెట్టండి. ఆయన పై గవ్వలు మీ ఇంటి మీదికి వచ్చే నరఘోష తగ్గిస్తాయి. వీటితో పాటు ఒక గోమతి చక్రం తెచ్చుకొని పూజ చేసుకొని, పూజ గదిలో పెట్టుకోవడం వల్ల ఈ గోమతి చక్రం మీ నరఘోష తొలగిస్తుంది.

 

అలాగే ప్రతిరోజు ఇంట్లో ప్రాత కాలంలో, సాయంకాలం సమయంలో సాంబ్రాణి ధూపం వేయడం వల్ల నరఘోష దూరమవుతుంది. అసుర శక్తులు బయటకు వెళ్లిపోతాయి. ప్రతిరోజు గృహంలో ఉదయం, సాయంత్రం స్వచ్ఛమైన నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. దీనివల్ల ఇట్లా చేయడం వల్ల లక్ష్మీ అమ్మవారు మీ గృహాన్ని అనుగ్రహిస్తుంది. పూజగదిలో అన్ని శుభ్రమైన విగా ఉండాలి. అప్పుడే లక్ష్మీ అమ్మవారు అనుగ్రహిస్తుంది. అంతేకాకుండా ఆవు పేడ పిడకలు పూజగదిలో పెట్టుకోండి. పూజా షాపులో కొనుక్కొచ్చే పిడక కాకుండా ప్రత్యక్షంగా ఆవు నుంచి వచ్చే పేడను తెచ్చి ఒక పిడకలను చేసి మీ పూజగదిలో పెట్టుకోండి. ప్రతిరోజు దానికి పసుపు కుంకుమ వేసి ఉంచండి. దీనివల్ల నరఘోష నివారణ జరుగుతుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -