Wake Up: నిద్ర లేచిన వెంటనే దేవుని అనుగ్రహం మనపై ఉండాలంటే ఏం చేయాలో తెలుసా?

Wake Up: ప్రతిరోజు మనం ఉదయం నిద్ర లేవగానే మొదటగా చూసేది మన సెల్ ఫోన్.రాత్రి పడుకున్న తర్వాత కూడా సెల్ ఫోన్ మన పక్కన ఉండాల్సిందే ఉదయం లేవగానే మన ఇష్టదైవం ఫోటో కాకుండా అలాగే మనకు ఇష్టమైన వారిని చూడకుండా సెల్ ఫోన్ చేతిలో పట్టుకున్న తర్వాతనే కళ్ళు తెరుస్తాము ఇలా చేయటం వల్ల అష్ట దరిద్రాలు మనల్ని వెంటాడుతాయని పండితులు చెబుతున్నారు. మరి ఉదయం నిద్ర లేచిన వెంటనే ఏం చేయాలి అనే విషయానికి వస్తే..

చాలామంది ఉదయం నిద్ర లేవగానే వారికి ఇష్టమైన వారిని చూస్తారు లేదంటే మరి కొందరు ఇష్టదేవత ఫోటోని చూస్తారు అలాగే మరికొందరు చేతులను బాగా రాపిడి చేసి అనంతరం అరచేతులను చూసుకుంటారు ఇలా ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఉదయం నిద్ర లేవగానే కొన్ని వస్తువులను చూస్తుంటారు అయితే ప్రస్తుత జనరేషన్లో వారు మాత్రం సెల్ ఫోన్ మాత్రమే చూస్తారు.మరి ఉదయం నిద్ర లేవగానే ఏం చేస్తే ఆ దేవుడి అనుగ్రహం మనపై ఉంటుంది అనే విషయానికి వస్తే..

 

ఉదయం నిద్ర లేవగానే వెంటనే కళ్ళు తెరవకుండా మన రెండు చేతులను బాగా రాపిడి చేయాలి ఇలా రాపిడి చేయడం వల్ల వేడి పుడుతుంది ఆ వేడిని మనం మన కళ్ళకు అడ్డుకున్న తర్వాత అనంతరం మెల్లిగా కళ్ళు తెరుస్తూ అరచేతులను చూసుకోవాలి. ఇలా అరచేతులను చూసుకున్న తర్వాత మన ఇష్ట దైవాన్ని తలుచుకొని కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతి.. కరమూలే స్థితాగౌరి ప్రభాతే కరదర్శనం.. అని ఈ శ్లోకాన్ని చదువుకుంటూ అరచేతుల్ని చూసుకోవాలి. అనంతరం మంచం మీద నుంచి కిందకు దిగాలి.

 

ఇలా మంచం మీద నుంచి కిందికి దిగిన తర్వాత ముందుగా భూమాతకు కూడా నమస్కారం చేసుకోవాలి.
భూదేవిని నమస్కారం చేసుకుంటున్నప్పుడు.. సముద్రవసనే దేవి పర్వతస్థానమణ్డలే, విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే.. అని చదువుకోవాలి. ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే ఇలా చేయటం వల్ల ఆ దేవదేవతల అనుగ్రహం మనపై ఉండి ఆ రోజు మొత్తం ఏ విధమైనటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సవ్యంగా సాగేలాగా ఉంటుందని పండితులు చెబుతున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -