Akhanda: అఖండ మూవీ సీక్వెల్ లో నటిస్తున్న బాలీవుడ్ స్టార్ ఎవరో తెలుసా?

Akhanda: నందమూరి నటసింహం హీరో బాలకృష్ణ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఈ వయసులో కూడా అదే ఊపుతో సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు బాలయ్య బాబు. ఇక ఈ మధ్యకాలంలో బాలయ్య బాబు నటించిన సినిమాలలో అఖండ సినిమా కూడా ఒకటి. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టించింది. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే.. ఒకప్పటి హీరో శ్రీకాంత్ విలన్ గా నటించారు.

అలాగే హీరోయిన్ పూర్ణ కూడా ముఖ్య పాత్రలో నటించింది. ఇది ఇలా ఉంటే అఖండ సినిమా భారీ విషయాన్ని అందుకోవడంతో నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడు అఖండ 2 సినిమా విడుదల అవుతుందా అని ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అంతేకాకుండా అఖండ 2పై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇక అఖండ సినిమా తర్వాత అఖండ2 ఎప్పుడు మొదలవుతుంది? ఎప్పుడు రిలీజ్ అవుతుంది? సినిమాను ఎప్పుడు మొదలు పెట్టబోతున్నారు. ఇలాంటి అనేక రకాల ప్రశ్నలు తలెత్తుతూనే ఉన్నాయి. కాగా బోయపాటి శ్రీను ఇప్పటికే అఖండ 2 స్క్రిప్ట్ పూర్తి చేశాడు. ఈ ఏడాది జూన్ నుంచి ఈ సినిమా స్టార్ట్ కాబోతుంది అని తెలుస్తోంది.

 

అఖండ 2 లో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కూడా ఒక కీలక పాత్రలో నటించబోతునట్లు తెలుస్తోంది. అంటే ఇద్దరు స్టార్ హీరోలు నటించబోతున్నారన్నమాట. అలా ఇద్దరు స్టార్ హీరోలతో మల్టీ స్టారర్ ని ప్లాన్ చేస్తున్నారు దర్శకుడు బోయపాటి. అఖండ 2 సినిమా పై నార్త్ లో కూడా బజ్ ఉంటుంది అని టాక్. ఇక ఈ కథలో సోషియో ఫాంట‌సీ ఎలిమెంట్స్ ఉంటాయని మెయిన్ కథాంశమే చాలా కొత్తగా ఉంటుందని బాలయ్య నుంచి మరో వినూత్న సినిమా రాబోతుందని చెబుతున్నారు. అలాగే, బోయపాటి మార్క్ యాక్షన్ సీన్స్ అండ్ పొలిటికల్ పంచ్ లు మాత్రం సినిమాలో ఫుల్ గా ఉంటాయని తెలుస్తోంది. ప్రస్తుతం బాలయ్య బాబు బాబి దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా అనంతరం బోయపాటి దర్శకత్వంలో రాబోతున్న అఖండ 2 లో నటించబోతున్నట్టు తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Union Minister Piyush Goyal: వైఎస్సార్ ను సైతం ముంచేసిన సీఎం జగన్.. ఆ కేసులో కావాలనే ఇరికించారా?

Union Minister Piyush Goyal: వైయస్సార్ కాలనీ పట్ల కేంద్రమంత్రి పియూష్ గోయెల్ తన ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో పీయూష్ గోయల్ విలేకరులతో మాట్లాడుతూ జగన్ పాలనపట్ల విరుచుకుపడ్డారు. వైయస్సార్ కాంగ్రెస్...
- Advertisement -
- Advertisement -