Directors: ఈ డైరెక్టర్ల ఫేవరెట్ స్టార్ హీరోలు ఎవరో తెలుసా.. రాజమౌళి, బోయపాటి ఫేవరెట్ హీరోలు వీళ్లే!

Directors: మామూలుగా అభిమానులకు కొంతమంది ఫేవరెట్ హీరోలు ఉన్నట్లే స్టార్ డైరెక్టర్లు కూడా ఎంతోమంది హీరోలతో కలిసి పని చేసినప్పటికీ వారికంటూ కొంతమంది ప్రత్యేకమైన హీరోలు అభిమానించే హీరోలు ఉంటారు. అటువంటి హీరోలతో డైరెక్టర్లు కూడా ఎక్కువ సినిమాలు చేయడానికి ఆసక్తిని కనపరుస్తూ ఉంటారు. టాలీవుడ్ లో అలాంటి కొన్ని స‌క్సెస్ ఫుల్ కాంబినేష‌న్స్ ఉన్నాయి. రాజ‌మౌళి ఎన్టీఆర్ – త్రివిక్ర‌మ్ – బ‌న్నీ, బోయ‌పాటి- బాల‌య్య ఇలా కొన్ని కాంబినేషన్ లు ఉన్నాయి. అయితే రాజ‌మౌళి అభిమానించే హీరో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్.

రాజమౌలి ఎంత మంది హీరోల‌తో సినిమాలు చేసినా? త‌ను మెచ్చిన ఒకే ఒక్క న‌టుడు ఎన్టీఆర్. ఈ విష‌యాన్ని చాలా సంద‌ర్భాల్లో జ‌క్క‌న్న రివీల్ చేసారు. ఎలాంటి క‌థ‌ల్లోనైనా పాత్ర‌లోనైనా ఇట్టే ఒదిగిపోయే న‌టుడ‌ని జ‌క్క‌న్న అభిప్రాయం. అందుకే ఎన్టీఆర్ తో స్టూడెంట్ నెంబ‌ర్ వ‌న్, సింహాద్రి,య‌మ‌దొంగ‌, ఆర్ఆర్ఆర్’ లాంటి సినిమాలు చేశారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఈ నాలుగు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతోపాటు బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించాయి. అలాగే త్రివిక్ర‌మ్-బ‌న్నీ కాంబినేష‌న్ అలాంటింది. బ‌న్నీ న‌ట‌నంటే గురూజీ బాగా అభిమానిస్తాడు. అత‌డి టైమింగ్ పెర్పామెన్స్ ని ఇష్ట‌ప‌డ‌తాడు.

 

త్రివిక్ర‌మ్ క‌థ‌ల‌కి బ‌న్నీ ఈజీగా మౌల్డ్ అవుతాడు. అలా వీరిద్దరి కాంబినేషన్లో జులాయి, స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి, అల వైంకుఠ‌పుర‌మ‌లో లాంటి స‌క్సెస్ సినిమాలు విడుదల అయ్యి మంచి సక్సెస్ను సాధించాయి. దర్శకుడు సుకుమార్ కి నచ్చిన హీరో కూడా అల్లు అర్జున్. సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో ఆర్య,ఆర్య 2, పుష్ప లాంటి సినిమాలో విడుదల అయిన విషయం తెలిసిందే. మూడు కూడా బ్లాక్ బస్టర్ హిట్ లుగా నిలిచాయి. ఇప్పుడు పుష్ప 2 అనే మరో సినిమా కూడా రూపొందుతున్న విషయం తెలిసిందే. అలాగే బోయపాటి శ్రీను ఫేవరెట్ డైరెక్టర్ బాలకృష్ణ. వీరి కాంబోలో సింహా లెజెండ్ అఖండ సినిమాలు విడుదల అయ్యి సూపర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే.

 

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -