Varun , Lavanya: వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి శుభలేఖలో వాళ్ల ముగ్గురి పేర్లు ముందు పెట్టడానికి కారణాలివేనా?

Varun , Lavanya: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పెళ్లి పీటలు ఎక్కుతున్న సంగతి అందరికీ తెలిసిందే. కొన్ని సంవత్సరాలుగా హీరోయిన్ లావణ్య త్రిపాఠి ని ప్రేమిస్తున్న వరుణ్ తేజ్ పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకోబోతున్నాడు. నవంబర్ 1న ఈ జంట ఇటలీలో పెళ్లి చేసుకోబోతుంది. ఈ జంట డెస్టినేషన్ వెడ్డింగ్ ని జరుపుకుంటున్నారు.

ఇందులో భాగంగా వరుణ్ లావణ్యలు తమకు ఇష్టమైన దేశం ఇటలీలో పెళ్లి చేసుకుంటున్నట్లు ఎప్పటినుంచో టాక్ నడుస్తుంది. దానిని నిజం చేస్తూ ఇటలీలోని టస్కానీలో ఈ జంట పెళ్లి చేసుకుంటున్నారు. ఈ పెళ్లికి కూడా చాలా కొద్ది మంది సమక్షంలోనే జరుపుకుంటున్నారు. అయితే ఇప్పుడు వీరికి సంబంధించిన పెళ్లి కార్డు వైరల్ అవుతుంది.

సిల్వర్ కలర్ లో ఉన్న ఈ వెడ్డింగ్ కార్డు మొదట వరుణ్ తేజ్ తాతయ్య, నానమ్మల పేర్లు పెట్టారు. తర్వాత వరుణ్ పెదనాన్న చిరంజీవి పేరు, బాబాయి పవన్ కళ్యాణ్ పేరు చివరగా వాళ్ళ అన్నయ్య రామ్ చరణ్ పేర్లు ముద్రించారు. ఈ పేర్లతోపాటు వరుణ్ తల్లిదండ్రుల పేర్లు నాగబాబు, పద్మజ. లావణ్య తల్లిదండ్రులు కిరణ్, దియో రాజ్ త్రిపాఠి పేర్లను ముద్రించారు. ప్రస్తుతం ఈ పెళ్లి కార్డు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక పెళ్లి కోసం ఇప్పటికే వీరిద్దరూ ఇటలీకి బయలుదేరి వెళ్లారు.

ఈ విషయాన్ని వారు తన ఇన్స్టా పోస్టు ద్వారా వెల్లడించారు. అయితే ఈ పెళ్లికి చాలా తక్కువ మంది గెస్ట్ లు మాత్రమే హాజరు కానున్నారు. గెస్ట్ లిస్టులో మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ తో పాటు రామ్ చరణ్, ఉపాసన, అల్లు అర్జున్, సాయిధరమ్ లు ఉన్నారు. వీరి ఎంగేజ్మెంట్ కూడా చాలా తక్కువ మంది సమక్షంలో జరిగింది. అయితే రిసెప్షన్ మాత్రం చాలా గ్రాండ్ గా జరుగుతుంది అని సమాచారం.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -