Ram Charan: స్టార్ హీరో రామ్ చరణ్ తల్లిలా భావించే ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా?

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు గ్లోబల్ స్టార్ అయ్యాడు. హలీవుడ్ లో సైతం ఇప్పుడు రామ్ చరణ్ కొత్త సినిమాల కోసం ఎదురుచూస్తుంది అనటంలో అతిశయోక్తి లేదు. అలాగే 12 ఏళ్ళ వయసులో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జయసుధ ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్లు అవుతుంది. తన ఇన్ని సంవత్సరాల జర్నీలో చాలామంది నటీనటులతో కలిసి నటించింది జయసుధ. ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది నటులకు అక్కగా, చెల్లిగా, తల్లిగా నటిస్తూ సహజనటిగా పేరు తెచ్చుకుంది.

హీరోయిన్ గా ఎంత పేరు తెచ్చుకుందో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా అంతే పేరు తెచ్చుకుంది జయసుధ. అయితే ఇంతమంది ఆర్టిస్టులలో తనకి ఇష్టమైన హీరో పేరు చెప్పమంటే ఆమె ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రామ్ చరణ్ పేరు చెప్పుకొచ్చింది. అయితే ఇప్పుడు వీళ్ళిద్దరిని కలిపి ఎందుకు మాట్లాడుతున్నామంటే వీళ్ళిద్దరికీ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. అతడు తనకి కొడుకు లాంటివాడని.

అతడు తనని తల్లిలాగా భావించి చూపించిన ఎఫెక్షన్ ఎప్పటికీ మర్చిపోనని, ఎప్పటికైనా రామ్ చరణ్ ఇంతకన్నా పెద్ద పొజిషన్ కి వెళ్తాడని రాంచరణ్ పై తనకి ఉన్న అభిమానాన్ని మీడియా సాక్షిగా బయటపెట్టింది జయసుధ. ఎవడు మూవీలో రామ్ చరణ్ కి తల్లిగా నటించిన జయసుధ ఆ క్యారెక్టర్ తనకి ఎంతో ఇష్టమైన క్యారెక్టర్ అని ఇందులో తన పాత్రకి మంచి పేరు వచ్చిందని కొడుకుగా రామ్ చరణ్ నటన అద్భుతం అని చెప్పుకొచ్చింది.

అలాగే రామ్ చరణ్ కి కూడా జయసుధ అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం ఉందని అందరికీ తెలిసిందే. ఆయన జయసుధను తల్లిలా భావిస్తారట. జయసుధ చాలా మంచి మనిషని రామ్ చరణ్ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. టాలీవుడ్ లో కొందరి బంధాలు ఇలాగే ఉంటాయి. తెరమీద ఆ బంధం ఎంత అందంగా ఉంటుందో నిజ జీవితంలో కూడా ఆ బంధం అంతే అందంగా ఉంటుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -