Relationship: మనిషికి సెక్స్ అవసరమా.. ఏమైనా ప్రయోజనాలు ఉన్నాయా

Relationship: మనలో చాలామంది సెక్స్ గురించి ఇతరులతో చర్చించుకోవడానికి అంతగా ఇష్టపడరు. అయితే చాలామంది శృంగారం చేయడం వల్ల లాభం ఉంటుంది అనుకుంటే మరికొందరి నష్టం ఉంటుంది అని అభిప్రాయపడుతూ ఉంటారు. ఇదే విషయంపై ఎన్నో పరిశోధనలు చేసి సెక్స్ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయాన్ని తెలిపిన విషయం తెలిసిందే. ఇకపోతే చాలామంది అనుకుంటున్నట్లు నిజంగానే మనిషికి సెక్స్ అవసరమా? ఈ విషయంపై నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ప్రతిరోజూ సెక్స్ లో పాల్గొనేవారిలో ఆరోగ్య సమస్యలు చాలా తక్కవగా ఉంటాయి. అంతేకాకుండా సెక్స్ లో తరచుగా పాల్గొనడం వల్ల ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించవచ్చు. కాబట్టి ఆరోగ్యంగా ఎక్కువ కాలం జీవించడానికి అయిన కచ్చితంగా కలయికలో పాల్గొనాలి అంటున్నారు నిపుణులు. అయితే శృంగారాన్ని సురక్షిత పద్ధతిలో పాల్గొనకుంటే మాత్రం అనేక సమస్యలు, లైంగిక సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇకపోతే సైన్స్ ప్రకారం కనీసం వారానికి రెండు సార్లు అయిన శృంగారంలో పాల్గొనడం చాలా మంచిది.
అలాగే తరచూ శృంగారంలో పాల్గొనడం అనేది ఒక వ్యాయామం లాంటిది.

 

దాని వల్ల గుండె సంబంధిత వ్యాధులు త్వరగా దరిచేరవు. అంతేకాకుండా ఈస్ట్రోజన్, టెస్టోస్టెరాన్ లను బ్యాలెన్స్ చేస్తుంది. అలాగే శృంగారంలో పాల్గొనడం వల్ల ఒత్తిడి సమస్యల నుంచి బయటపడవచ్చు. అలాగే వారానికి కనీసం రెండు సార్లు శృంగారంలో పాల్గొనే వారిలో హృదయ సంబంధిత సమస్యలు చాలా తక్కువగా వస్తాయి. శృంగారంపై ఆసక్తి చూపనివారికే ఈ సమస్య ఎక్కువగా వేదిస్తోంది. చాలా రకాల నొప్పులకు కూడా శృంగారం మందులాగా పనిచేస్తుందట. తలనొప్పి, కాళ్ల నొప్పులు,మహిళల పీరియడ్ పెయిన్స్ వీటన్నింటికీ దూరంగా ఉంచుతుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -