Allu Arjun: పుష్ప2కు ఆస్కార్ రావాలని అల్లు అర్జున్ కోరుకుంటున్నారా?

Allu Arjun: ఈ ఏడాది భారతీయ సినిమాకు ఎంతో ప్రత్యేకం. ముఖ్యంగా తెలుగు సినీ ప్రపంచం ఈ సంవత్సరాన్ని మరిపోలేదు. దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం ఆస్కార్ గెలుచుకుంది. తెలుగు సినిమాకు దాహం తీరింది. ఇక మిగిలిన డైరెక్టర్లకు సైతం ఇది ఒక ఛాలెంజింగ్ సందర్భం.

 

ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్ల కోసం ఆ టీఎం ఎన్నో నెలలపాటు కష్టపడింది. డైరెక్టర్ రాజమౌళి అయితే అమెరికాలోనే ఉన్నాయి. అన్నీ పనులను దగ్గరుండి చూసుకొని, చివరికి అస్కార్ సాధించారు. ఇక హీరోలు రామ్, భీమ్ కూడా అక్కడి మీడియాతో, అభిమానులతో, సినీ ప్రముఖులతో ఇంటరాక్ట్ అయ్యారు. పలు టీవీ షోలలోనూ పాల్గొన్నారు. వారిచేత ఎంత వరకు చేయించాలో అంత ప్రమెషనూ చేయించారు. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో అకాడమీ అవార్డ్ తెలుగు సినిమాని వరించింది.

ఒక విధంగా దేశం పక్కన పెట్టినా కానీ పర్సనల్‌గా తన సినిమాను తానే ప్రమోట్ చేసుకుని ఆస్కారి బరిలో నిలిపి గెలిచి చూపించారు జక్కన్న. తెలుగు సినిమాని పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లింది. ఆస్కార్ సాధించింది రాజమౌళి వల్లనే అని పక్కాగా చెప్పవచ్చు. ఆస్కార్స్‌లో పర్సనల్ ఎంట్రీకి డోర్స్ ఓపెన్ చేశారాయన. తర్వాత పుష్ప : ది రూల్ వంతే అంటున్నారు. పుష్ప : ది రైజ్ ని హిందీలో రిలీజ్ చేయాలా వద్దా అని మేకర్స్ సందేహిస్తుంటే ధైర్యంగా చెయ్యమని చెప్పింది జక్కన్నే. ఆ సినిమా నార్త్‌లో క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. ఆస్కార్ ఎంట్రీకి కావాలసిన అన్ని అంశాలు. అర్హతలు పుష్ప-2 లో ఉన్నాయి. సరిగ్గా ప్రమోట్ చేస్తే అవార్డ్ గెలవచ్చంటున్నారు సినీ వర్గాల వారు. మరి పార్ట్ 1 విషయంలో సాయం చేసిన దర్శకధీరుడు పార్ట్ 2కి కూడా సాయమందిస్తారా అనేది ప్రశ్నగా ఉంది. ఈ సినిమాకు రాజమౌళి సాయం చేస్తే, పక్కగా ఆస్కార్ వస్తోందని అల్లు అర్జున్ అభిమానులు అంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -