CM Jagan: సీఎం జగన్ కు ప్రధాని కావాలని ఉందా.. ఏం జరిగిందంటే?

CM Jagan: తాజాగా మహారాష్ట్రకు చెందిన కాకాసాహెబ్ లక్ష్మణ్ కాక్డే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. ఈ క్రమంలోనే ఆయన సీఎం జగన్ ప్రధాని కావాలి అన్న స్లోగన్ తో కూడిన టీ షర్ట్ ని ధరించారు. జగన్ కూడా ఆయనను ప్రత్యేకంగా ఆహ్వానించడంతోపాటు ఫోటోలు దిగగా అందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దాదాపు 800 కిలోమీటర్లు సైకిల్ పై యాత్ర చేసి వచ్చాడని, అంతేకాకుండా జగన్ ప్రధానమంత్రి కావాలి అనుకుంటున్నారు అని చెప్పుకొచ్చారు. వైసీపీ సోషల్ మీడియా మొత్తం ఆ విషయాన్ని ట్రెండ్ చేసే ప్రయత్నం చేసింది.

దీంతో ప్రధాని పదవిపై జగన్ ఆశపడ్డారని చాలా మందికి క్లారిటీ వస్తోంది. ఇదివరకు ఇలాంటి వార్తలు వినిపించినప్పటికీ తాజాగా జరిగిన విషయంతో అది నిజం అనే తెలీంది. ఇదే విషయాన్ని బీజేపీ నేత ఆది నారాయణరెడ్డి కూడా ధృవీకరిస్తున్నారు. సీఎం పదవి వచ్చిందని జగన్ సంతృప్తి పడటం లేదని ప్రధాని పదవిపై ఆశ పెట్టుకుంటున్నారని ఆది నారాయణ రెడ్డి ఆరోపిస్తున్నారు. తాజాగా ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆదినారాయణ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పదవిపై ఆశతో దారుణాలకు పాల్పడుతున్నారని ఆయన తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య వెనుక భారీ కుట్ర ఉందని అదంతా సీబీఐకి తెలుసని ఆదినారాయణ రెడ్డి స్పష్టం చేశారు.

 

సీబీఐ విచారణ అనుకూలంగా చేయకపోయినా కోర్టు తీర్పులు అనుకూలంగా రాకపోయినా తప్పు పడుతున్నారని వారు చెప్పినట్లే జరగాలా అంటూ ఆయన ప్రశ్నించారు. అంతే కాకుండా తనని కూడా చంపేందుకు కుట్రలు చేస్తున్నారని ఆది నారాయణరెడ్డి ఆరోపించారు. తనకు సెక్యూరిటీ కూడా లేదని ఎప్పుడైనా చంపుకోవచ్చని స్పష్టం చేశారు. తాను ఇక లేనని ఎప్పుడైనా తనను చంపేయవచ్చని కుటుంబసభ్యులకు కూడా తాను చెప్పినట్లు చెప్పుకొచ్చారు ఆదినారాయణ రెడ్డి.

Related Articles

ట్రేండింగ్

YSR Cheyutha Scheme: డబ్బులన్నావ్.. డబ్బాలు కొట్టుకున్నావ్.. చేయూత నాలుగో విడత జమయ్యాయా జగన్?

YSR Cheyutha Scheme: జగన్మోహన్ రెడ్డి ఇటీవల తన ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన సంగతి తెలిసిందే .ఈ మేనిఫెస్టోలో భాగంగా ఈయన గత ఐదు సంవత్సరాల కాలంలో ఏ సామాజిక వర్గానికి...
- Advertisement -
- Advertisement -