Hairloss: ఆల్కహాల్ సేవిస్తే జుట్టు రాలుతుందా?

Hairloss: ప్రస్తుత రోజుల్లో చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్య జుట్టు ఊడిపోవడం. జీవనశైలిలో వచ్చిన ఆహారపు అలవాట్లు కారణంగా ఈ హెయిర్ ఫాల్ సమస్య అన్నది మరింత ఎక్కువ అవుతోంది. కొంతమంది ఒత్తిడికి గురైనప్పుడు వెంట్రుకలు ఊడిపోతూ ఉంటాయి. మరికొందరికి తల స్నానం చేసినప్పుడు మరి కొంతమందికి దువ్వెనతో దువ్వినప్పుడు ఇలా అనేక సందర్భాలలో వెంట్రుకలు ఊడిపోతూ ఉంటాయి. అయితే ఎక్కువ మొత్తంలో ఊడిపోయినప్పుడు చాలామంది ఆందోళన చెందుతూ ఉంటారు.

మరీ ముఖ్యంగా మహిళలు ఎక్కువ ఆందోళన చెందుతూ ఉంటారు. అలాగే పురుషులకు కూడా 30 35 ఏళ్ల వయసు వచ్చేసరికి హెయిర్ ఫాల్ సమస్యతో వెంట్రుకలు మొత్తం పూసి పోయి బట్టతల సమస్యతో బాధపడుతున్నారు. వెంట్రుకలు హెయిర్ ఫాల్ కాకుండా ఉండడం కోసం కంట్రోల్ చేసుకునేందుకు కొందరు అనేక షాంపులను వాడుతుంటారు. అయినా ఫలితం మాత్రం పెద్దగా కనిపించదు. అయితే చాలామంది పురుషులు అతిగా మద్యం సేవిస్తూ ఉంటారు. ఇటీవల కాలంలో టెక్నాలజీ డెవలప్ అవ్వడంతో స్త్రీలు కూడా మద్యం సేవిస్తున్నారు.

 

మరి నిజంగానే మద్యం సేవిస్తే జుట్టు రాలే సమస్య ఎక్కువ అవుతుందా ఈ విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మద్యం అనేది జుట్టుకు హాని చేస్తుంది. మన శరీరంలోని ప్రోటీన్లను బలహీన పరుస్తుంది. దాంతో జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలడం అనేది ఆల్కహాల్ తీసుకోవడం వలన కలిగే సైడ్ ఎఫెక్ట్. మరికొందరికి మద్యం సేవించకపోయినప్పటికీ హెయిర్ ఫాల్ సమస్య వస్తూ ఉంటుంది. కానీ కేవలం ఆల్కహాల్ వల్లే జుట్టు రాలిపోతుంది అని చెప్పడంలో వాస్తవం లేదు అంటున్నారు నిపుణులు.

 

ప్రోటీన్లు ఉన్న ఫుడ్ తీసుకోకపోవడం, అధిక ఒత్తిడి, నిద్రలేమి, పొల్యూషన్, చుండ్రు, సరిపడా వాటర్ తాగక పోవడం, విటమిన్లు లేని ఆహారం తీసుకోవడం, కల్తీ షాంపులు వాడటం వంటివి కూడా జుట్టు రాలడానికి కారణంగా చెప్పవచ్చు. కాబట్టి ఆల్కహాల్ సేవించడం వల్ల జుట్టు రాలిపోతుంది అన్నది కరెక్టే కానీ, జుట్టు రాలిపోవడానికి ఆల్కహాలే కారణం అన్నది కరెక్ట్ కాదు అంటున్నారు నిపుణులు.

Related Articles

ట్రేండింగ్

Andhra Pradesh Assembly Elections: గులకరాళ్లతో, పసుపు చీరలతో రాజకీయాలు.. ఏపీ పరిస్థితి ఇంత దారుణంగా ఉందా?

Andhra Pradesh Assembly Elections: మరొక రెండు వారాలలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికలు కూడా జరగబోతున్నటువంటి నేపథ్యంలో రాజకీయ వేడి రాజుకుంది. ఈ విధంగా ఎన్నికల త్వరలో జరగబోతున్నటువంటి...
- Advertisement -
- Advertisement -