Madhya Pradesh: పొలంలో పంటపై లిక్కర్ స్ప్రే చేసిన యువకుడు.. ఆ తర్వాత ఏమైందంటే?

Madhya Pradesh: సాధారణంగా వ్యవసాయంలో మంచి దిగుబడి సాధించడానికి రైతులు కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అంతేకాకుండా చీడపురుగుల నుండి పంటను రక్షించుకోవటానికి పేదరికల రసాయన మందులను పిచికారి చేస్తూ ఉంటారు. ఆ మందుల వల్ల వంటకు చీడపురుగులు పెడితే తప్పి పంట దిగుబడి అధికంగా ఉంటుందని వేల రూపాయలు ఖర్చు చేసి రైతులు పురుగుల మందులు కొనుగోలు చేస్తున్నారు.

ఇటీవల మధ్యప్రదేశ్ రైతులు పంటల సాగును పెంచేందుకు వినూత్న పద్ధతులను అవలంబిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. మధ్యప్రదేశ్ లోని నర్మదాపురం ప్రాంతానికి చెందిన రైతులు వేసవి పెసర పంటల ఉత్పత్తిని రెట్టింపు చేయడానికి దేశీ మద్యాన్ని ఉపయోగిస్తున్నారు. చీడపురుగుల నుండి పంటను రక్షించుకోవడానికి పురుగుల మందులకు బదులు మధ్యాన్ని పంటపై పిచికారి చేస్తున్నారు.

 

ఇలా చేయటం వల్ల పంట దిగుబడి పెరగడమే కాకుండా నాణ్యత కూడా పెరుగుతుందని రైతులు నమ్ముతున్నారు. ఒక్క నర్మదాపురంలోనే కాదు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఈ కొత్త టెక్నిక్‌ని ఉపయోగించుకోవడం మెల్లగా మొదలుపెట్టారు.
పప్పు ధాన్యాల పంటలను చీడపురుగుల నుండి రక్షించడానికి పురుగుల మందులకు బదులు ఆల్కహాల్ పిచికారీ చేయటం అద్భుతమైన ఫలితాలను ఇవ్వటమే కాకుండా ఈ విధానం చాలా సులభమని రైతులు అంటున్నారు.

 

దేశీ మద్యాన్ని తీసుకుని స్ప్రే పంపులో నీళ్లతో కలుపుకొని పంట మీద పిచికారి చేస్తున్నారు. 20 లీటర్ల నీటిలో 100 ఎంఎల్ ఆల్కహాల్ కలిపి పిచికారి చేయటం వల్ల పంట దిగుబడి అధికంగా ఉంటుందని తెలుపుతున్నారు. అంతేకాకుండా ఆల్కహాల్‌ను స్ప్రే చేయడం వల్ల తమ శరీరానికి ఎలాంటి హాని జరగదని, అయితే దాని దుర్వాసన వల్ల మాత్రం తరచుగా అనారోగ్యానికి గురవుతారని వారు చెబుతున్నారు. అయితే ఇలా పంటలకు ఆల్కహాల్ పిచికారి చేయడంపై కొందరు శాస్త్రవేత్తలు వ్యతిరేకత తెలియజేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

YSRCP: మే ఒకటో తేదీనే ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు.. జగన్ మాయలు మామూలుగా లేవుగా!

YSRCP:  మే 1, బుధవారం ఉదయం గవర్నమెంట్ ఉద్యోగస్తులందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. తమ ఫోన్స్ కి వస్తున్న మెసేజ్లను చూసి ఏం జరిగిందో తెలియని అయోమయంలో పడ్డారు. అయితే అసలు విషయం...
- Advertisement -
- Advertisement -