Prabhas: అలాంటి అరుదైన రికార్డ్స్ ప్రభాస్ కే సొంతమా?

Prabhas: పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా పాన్ ఇండియా సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్నటువంటి ఈయన తాజాగా రామాయణం ఇతిహాసం నేపథ్యంలో తెరకెక్కిన ఆది పురుష్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాతో థియేటర్లన్నీ కూడా జైశ్రీరామ్ అనే నామస్మరణతో మారుమోగిపోతున్నాయి.

ఇక ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది అయితే ఈ సినిమా కోసం ఎంతో ఎదురు చూస్తున్నటువంటి అభిమానులు పెద్ద ఎత్తున సినిమా చూడటం కోసం థియేటర్లకు తరలివస్తున్నారు.ఇక ఈ సినిమా మొదటి రోజే 100 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టిందని తెలుస్తుంది.ఈ క్రమంలోనే ప్రభాస్ ఖాతాలో మరొక అరుదైన రికార్డ్ చేరిపోయింది.

ఇప్పటివరకు మన సినీ ఇండస్ట్రీలో మొదటి రోజు 100 కోట్ల ఓపెనింగ్ రాబట్టిన సినిమాలు కేవలం 6 మాత్రమే ఉన్నాయి. ఇందులో బాహుబలి 2, సాహో, రాధే శ్యామ్, ఆర్ఆర్ఆర్, కే జి ఎఫ్ 2, పఠాన్. ఈ ఆరు చిత్రాలు తొలి రోజు 100 కోట్ల కలెక్షన్లను రాబట్టి సరికొత్త రికార్డు సృష్టించాయి. అయితే ఇందులో మూడు సినిమాలు ప్రభాస్ నటించిన సినిమాలు కావడం విశేషం.

ఇలా ఒకే హీరో నటించిన మూడు సినిమాలు మొదటి రోజు 100 కోట్ల కలెక్షన్లు రాబట్టడంతో ప్రభాస్ ఈ విషయంలో సరికొత్త రికార్డు సృష్టించారని చెప్పాలి అయితే ఇప్పుడు ఆయన నటించిన ఆది పురుష్ సినిమా కూడా ఫస్ట్ డే ఓపెనింగ్స్ 100 కోట్ల కలెక్షన్లను రాబట్టడమే కాకుండా ప్రభాస్ నాలుగవ సినిమా కూడా కావడంతో ఇలాంటి సరికొత్త రికార్డులను సృష్టించడం కేవలం ప్రభాస్ కి మాత్రమే సాధ్యమైందనీ చెప్పాలి.ఇలా ప్రభాస్ సరికొత్త రికార్డులను సృష్టించడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -