Relationship Tips: హస్తప్రయోగం ఆ సమస్యకు దారితీస్తుందా?

Relationship Tips: హస్త ప్రయోగం. దీని గురించి దాదాపు అందరికీ అవగాహన ఉండే ఉంటుంది. అయితే సెక్స్ జీవితంలో తృప్తి లేని వారు. లేదంటే పెళ్లి కానివారు మాత్రమే హస్త ప్రయోగం పై ఆసక్తి చూపుతుంటారని మంది అనుకుంటూ ఉంటారు. కానీ.. అందులో నిజం లేదు. లైంగిక తృప్తి సంతృప్తిగా ఉన్నవారు కూడా హస్తప్రయోగంలో పాల్గొంటారు. ఇది మంచి అనుభూతిని కలిగిస్తుంది. అందుకే దీని పట్ల ఎక్కువగా ఆకర్షితులౌతూ ఉంటారు. యువతీ యువకులు తమలోని లైంగిక కోరికలను అణిచి పెట్టుకోలేక హస్త ప్రయోగం ద్వారా స్వయంతృప్తి పొందుతుంటారు.

హస్త ప్రయోగం చేయడం మంచిదే కానీ కొంతమంది శృతి మించి రోజులో నాలుగైదు సార్లు కూడా చేస్తూ ఉంటారు. దీనివల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎక్కువసార్లు హస్త ప్రయోగం చేయడం వల్ల కీళ్ల నొప్పులు రావడం, కళ్లకింద నల్లటి మచ్చలు ఏర్పడటం, శరీరమంతా నీరసంగా ఉండటం ఇలాంటివి జరుగుతాయని చాలా మంది భావిస్తుంటారు. కానీ అవన్నీ అపోహలు మాత్రమే అంటున్నారు నిపుణులు. హస్త ప్రయోగం వల్ల ఎలాంటి దుష్పరిణామాలు ఉండవు. నిజానికి హస్త ప్రయోగం క్రమం తప్పకుండా చేసుకునేవాళ్లు చాలా యంగ్ గా, యాక్టివ్ గా కనిపిస్తారు.

 

ఉత్సాహంగా ఉండే వారిలోనే సెక్స్ కోరికలు ఎక్కువగా ఉంటాయి. హస్త ప్రయోగం అలవాటు ఉన్నవారి ముఖంలో ఒకరకమైన గ్లో కనపడుతుంది. కోరికలను ఈ విధంగా తృప్తి పరుచుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్స్ట్ కూడా ఉండవు. అసలు శృంగారంలో పాల్గొనని వారు, కనీసం హస్త ప్రయోగం అలవాటు కూడా లేనివారే ముఖంలో జీవం కోల్పోయినట్లుగా ఉంటారు. అలాగే హస్త ప్రయోగం వల్ల సెక్స్‌ జీవితానికి ఎటువంటి ప్రమాదం ఉండదు. చాలా మందికి హస్తప్రయోగం వల్ల పెళ్లికాని వారు వర్జినిటీ కోల్పోయే అవకాశం ఉందని అనుకుంటూ ఉంటారు. కానీ అది కేవలం అపోహ మాత్రమే అని తేలిపోయింది. కేవలం స్త్రీ అంగంలోని పురుషుడి అంగం చొచ్చుకుపోయినప్పుడు మాత్రమే వర్జినిటీ కోల్పోతారు. అలా జరగనప్పుడు వర్జినిటీ కోల్పోయే అవకాశమే ఉండదు అంటున్నారు నిపుణులు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -