Vijayasai Reddy: ఆ ప్రశ్నలకు విజయసాయిరెడ్డి దగ్గర సమాధానం ఉందా?

Vijayasai Reddy: వైయస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటారు. ఈ క్రమంలోనే ఈయన ట్విట్టర్ వేదికగా హైదరాబాద్, బెంగళూరు లాంటి మెట్రో నగరాలు మనకు లేకున్నా ఐటీ ఎగుమతుల్లో 5 వేల కోట్లతో 34% నమోదైన వృద్ధి సిఎం జగన్ గారి సంకల్పం వల్లనే సాధ్యమైంది. విశాఖతో పాటు ద్వితీయ శ్రేణి నగరాల్లో కూడా ఐటి కంపెనీల ఏర్పాటును వైయస్సార్సీపి ప్రభుత్వం ప్రోత్సహిస్తూ ఈ ఏడాదిలో మరో 20 వేల ఉద్యోగాలను అందించబోతున్నారంటూ ఈయన ట్వీట్ చేశారు.

 

ప్రస్తుతం విజయ్ సాయి రెడ్డి చేసినటువంటి ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఐటీ కంపెనీలను వేళల్లో లెక్కపెట్టవచ్చు. కొన్ని కంపెనీలు మాత్రమే విశాఖలో ఉన్నాయి. మిగిలిన కంపెనీలన్ని హైదరాబాద్ కి తరలి వెళ్లాయి. ఇలా వేలపై లెక్కపెట్టే ఐటి కంపెనీలలో 34 శాతం వృద్ధి సాధించామని, రూ.5,000 కోట్ల ఎగుమతులు సాధించామని విజయసాయి రెడ్డి చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందనీ పలువురు విజయసాయిరెడ్డి చేసినటువంటి ట్వీట్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు.

ఒకప్పటి ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఐటీ రంగాన్ని ఎంతో అభివృద్ధి చేశారు. అయితే రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయాలని అమరావతిని రాజధానిగా ప్రకటించారు. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధానిని కూల్చి వేయడమే కాకుండా అభివృద్ధిని గాలికి వదిలేసారు.పక్క రాష్ట్రంలో ఐటీ రంగం అభివృద్ధి చెంది ప్రపంచ స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది.

 

కానీ మన రాష్ట్రంలో మాత్రం రాజధాని అభివృద్ధి అనేది పక్కన పెట్టి కేవలం సంక్షేమ పథకాలను విడుదల చేస్తూ సరైన పాలన అందిస్తున్నామని గొప్పలు చెబుతున్నారు. తెలంగాణలో ప్రతి వారం ఏదో ఒక కార్యక్రమానికి శంకుస్థాపన జరుగుతుంటే మన రాష్ట్రంలో మాత్రం ప్రతివారం ఏదో ఒక సంక్షేమ పథకానికి బటన్ నొక్కుతూ జగన్ సంక్షేమ నిధులను విడుదల చేస్తున్నారు. రాష్ట్రం విడిపోయి 10 సంవత్సరాలు అవుతున్న ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ కి రాజధాని లేకపోవడం ఎంతో విడ్డూరమని పలువురు ఈ విషయాలపై ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నప్పటికీ వారి నుంచి సరైన సమాధానం రాలేదని చెప్పాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -