Maharashtra: లిఫ్ట్‌లో డెలివరీ బాయ్‌ మర్మాంగంపై కుక్కదాడి.. రక్తంతో యువకుడి విలవిల

Maharashtra: చాలా మంది ఇష్టంగా కుక్కలను పెంచుకుంటుంటారు. వాటిని కుటుంబంలోని ఓ వ్యక్తి భావించి దాని బాగోగులు చూసుకుంటారు. అంత జాగ్రత్తగా చూసుకుంటున్న కొన్నిసార్లు వాటి తప్పిదాల మూలంగా యజమానులు ఇతరుల మాటలు పడాల్సి వస్తోంది. ఇటీవల పాఠశాల నుంచి తన ఇంటికి వెళ్లేందుకు అపార్ట్‌మెంట్‌లోని లిఫ్ట్‌ ఎక్కిన ఓ చిన్నారిని ఓ పెంపుడు కుక్క కరవడంతో ఆ కుక్కను తీసుకొచ్చిన మహిళపై అపార్టుమెంట్‌ వాసులు, నెటిజన్లు విమర్శలు గుప్పించారు.

వీధి కుక్కలు కరవడం సహజమే.. కానీ.. ఇటీవల పెంపుడు కుక్కలు సైతం దాడులకు తెగబడుతున్నారు. ఫుడ్‌ ఆర్డర్‌ చేసిన ఓ కస్టమర్‌కు ఫుడ్‌ ఇవ్వడానికి వెళ్లిన ఓ డెలివరీ బాయ్‌ మర్మాంగంపై పెంపుడు కుక్క గాయపర్చిన ఘటన మహారాష్ట్రలోని థానేలో చోటు చేసుకుంది. అక్కడున్న సీసీ కెమెరాల్లో డెలివరీ బాయ్‌పై కుక్క దాడి చేసిన వీడియో దృశ్యాలు నెట్టింట్లో వైరల్‌ అవుతున్నాయి. అది చూసిన నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు.

థానేలోని పన్వెల్‌ ప్రాంతంలో భోజనం ఆర్డర్‌ పెట్టిన ఓ కస్టమర్కు పార్సిల్‌ ఇవ్వడానికి జొమాటో డెలివరీ బాయ్‌ వెళ్లి పై అంతస్తు నుంచి లిఫ్ట్‌లో వస్తున్నాడు. లిఫ్ట్‌ దిగుతుండగా అక్కడ ఓ వ్యక్తి తన పెంపుడు కుక్కను పట్టుకుని నిలబడ్డాడు. ఆ డెలివరీ బాయ్‌ను చూసిన కుక్క ఒక్కసారిగా అతడి మర్మాంగంపై కరవడంతో రక్తం కారింది. గమనించిన స్థానికులు వెంటనే అతడిని సమీపంలోని డీవై పాటిల్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితుడు చికిత్స పొందుతున్నాడు.

ఈ వైరల్‌ అయిన వీడియోలో కుక్క ఆగ్రహానికి గురై డెలివరీ బాయ్‌ ప్రైవేట్‌ పార్ట్‌పై దాడి చేసినట్లు కనిపించింది. డెలివరీ బాయ్‌ నొప్పితో ఎంతో బాధపడడంతో పాటు.. ఆ భాగమంతా రక్తంతో తడిచిపోయింది. విపరీతమైన నొప్పితో బాధపడుతున్న ఆ డెలివరీ బాయ్‌ను చూసి నెటిజన్లు అయ్యో పాపం.. అంటూ కామెంట్ల రూపంలో జాలి చూపతున్నారు. ఆ కుక్క యజమానిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అతడిలో జైలులో పెట్టాలంటూ కామెంట్లు చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -