CM KCR: వైరల్ అవుతున్న సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు!

CM KCR: తాజాగా తెలంగాణ సీఎం కెసిఆర్ మహారాష్ట్రలోని జబిందా మైదానంలో ఏర్పాటు చేసిన టిఆర్ఎస్ భారీ బహిరంగ సభకు హాజరయ్యారు. సీఎం కెసిఆర్ కు మరాఠా నేతలు, ప్రజలు కేసీఆర్‎కు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మరాఠా నేతలకు బీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ నేపథ్యంలోనే బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. మహారాష్ట్ర రాష్ట్రంలో గోదావరి, కృష్ణా నదులు ఉన్నప్పటికీ ఎందుకు ప్రజలు ఇంకా నీటి సమస్యలతో సతమతమవుతువన్నారు. ముంబై దేశ ఆర్థిక రాజధానిలో కనీసం తాగేందుకు నీరు ఉండదా.

దేశం పురోగమిస్తుందా, లేక తిరోగమిస్తోందా? రాష్ట్రంలో పేదలు మరింత నిరుపేదలుగా మారుతున్నారు తప్ప ధనవంతులు కావడం లేదు. ఎందుకు ఇలా జరుగుతోంది. ఇప్పటికి అయిన ప్రజలు ఎంత త్వరగా మేలుకుంటే అంత త్వరగా అభివృద్ధి చూడగలుగుతారు. బీజేపీ కుట్రలకు భయపడితే ఏ పార్టీకి కూడా మనుగడ ఉండదు. నిజాయితీతో మేము చేసే పోరాటానికి తప్పకుండా విజయం లభిస్తుంది. బీఆర్ఎస్ ఒక మతం, ఒక ప్రాంతం కోసం అవిర్భవించలేదు. త్వరలో మహారాష్ట్రలో బీఆర్ఎస్ కార్యాలయం నిర్మిస్తాంము. అంతేకాకుండా మహారాష్ట్రలో కరెంటు, నీటి సమస్యలు తీరుస్తాము. రైతుల ఆత్మహత్యలకు అడ్డుకట్ట వేస్తాము.

 

నెహ్రూ సమయంలోనే దేశంలో కాస్తో కూస్తో అభివృద్ధి కనిపించింది. ఆ తరువాత వచ్చిన ప్రభుత్వాలు ఓ ప్రణాళిక లేకుండా పరిపాలించాయి. కాబట్టి వచ్చే ఏడాది తప్పకుండా మన పార్టీ గెలిస్తే ప్రజలకు మంచి చేయడంతో పాటు కరెంటు సమస్యలు నీటి సమస్యలు తీరుస్తాము అని తెలిపారు. అలాగే సాగు నీటి ప్రాజెక్టుల కోసం కొత్త చట్టాలు తీసుకొస్తాము. లేదంటే దేశంలో ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితులే కొనసాగుతాయి అని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే 5 ఏళ్లలో ప్రతి ఇంటికి మంచినీళ్లు అందిస్తాం. ఇదే నా వాగ్దానం. ఇది తెలంగాణలో సాధ్యం చేసి చూపించాము. తెలంగాణ రాష్ట్రంలో ధనికులు ఏ నీరు తాగుతారో అదే నీటిని ఆదిలాబాద్‎లోని గోండులు తాగుతారు. ఇదే ప్రగతి మహారాష్ట్రలోనూ సాధ్యమవుతుంది. ఎంత త్వరగా అయితే అంత త్వరగా ప్రతి ఎకరానికి సంపూర్ణంగా సాగు నీటిని అందిస్తాము అని తెలిపారు కెసిఆర్. కాగా కెసిఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -