Devotional: తీర్థం, ప్రసాదం తీసుకునే సమయంలో ఈ తప్పులు మాత్రం చేయొద్దంటూ?

Devotional: మన హిందూ సంప్రదాయాల ప్రకారం మనం ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆలయం చుట్టు ప్రదక్షిణలు చేయడం అలాగే గర్భగుడిలోకి వెళ్లి స్వామి వారిని దర్శించుకోవడం చేస్తుంటాం. ఇక స్వామివారి ఆలయంలోకి వెళ్ళిన తర్వాత మనం కొన్ని నియమాలను పాటిస్తూ స్వామి వారిని దర్శించుకోవడం అలాగే ఆలయంలో ఇచ్చే తీర్థప్రసాదాలు తీసుకోవడం జరుగుతుంది. అయితే ఆలయంలో ఇచ్చే తీర్థప్రసాదాలు విషయంలో కూడా కొన్ని నియమాలు పాటించాలి.

స్వామివారిని దర్శించుకున్న తర్వాత మనకుతీర్థ ప్రసాదాలు అందిస్తూ ఉంటారు. అయితే ఈ ప్రసాదం తీసుకునే సమయంలో మనం కొన్ని నియమాలను పాటించాలి. ఇలా ఆలయంలోకి వెళ్ళిన తర్వాత తీర్థం ఇచ్చేటప్పుడు చాలామంది కుడి చేతిని మాత్రమే ముందుకు చాచి తీర్థం తీసుకుంటారు. అలా కాకుండా ఎడమచేతి పైన కుడి చేతిని ఉంచి తీర్థం తీసుకోవాలి.

 

ఇకపోతే తీర్థం తాగిన తర్వాత చాలామంది ఆ చేతులను తలకు రాసుకుంటారు. ఇలా చేయడం మహా పాపం. తీర్థం తీసుకున్న తరువాత రెండు చేతులను రుద్దుకోవాలి కానీ తలకు మాత్రం రాయకూడదు. ఇక ప్రసాదం తీసుకునే సమయంలో కూడా చాలామంది కుడి చేతితో ప్రసాదం తీసుకుని అలాగే తింటారు కానీ అలా ఎప్పుడూ చేయకూడదు. కుడి చేతితో ప్రసాదం తీసుకుని దానిని ఎడమ చేతిలోకి వేసుకొని కొద్ది కొద్దిగా తినాలి.

 

ఇక ఆలయంలో మనం కొబ్బరికాయ సమర్పించినప్పుడు స్వామివారికి కొబ్బరికాయ కొట్టిన తర్వాత పండితులు ఆ కొబ్బరికాయలు మనకు ఇస్తారు. అలాంటి సమయంలో మహిళలు కొంగును చాచి ఆ కొబ్బరికాయను అలాగే స్వామివారి నుంచి ఇచ్చే ఫలము పుష్పాన్ని తీసుకోవాలి.ఇలా ఆలయంలోకి వెళ్ళిన తర్వాత తీర్థప్రసాదాలను ఈ నియమాలు పాటించి తీసుకోవాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -