Teeth: మీ దంతాలు పుచ్చిపోకూడదా.. ఈ ఒక్క పని చేయాల్సిందే!

Teeth: ఇప్పుడున్న రోజుల్లో చాలామంది చిన్న పెద్ద అని తేడా లేకుండా చాక్లెట్లు బిస్కెట్లు, కూల్ డ్రింక్స్ తాగడం వల్ల పళ్ళు తొందరగా పుచ్చిపోతూ ఉంటాయి. చాలామంది పిప్పి పన్ను సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఈ సమస్య వచ్చింది అంటే ఆ నొప్పి వర్ణనాతీతం అని చెప్పవచ్చు. ఇది తినాలి అన్నా మాట్లాడాలి అన్నా కూడా ఆలోచిస్తూ భయపడుతూ ఉంటారు. అయితే నోటిలో ఉండే క్రిముల‌ను చంపి దంతాలు పుచ్చిపోకుండా ఉండాల‌ని మ‌నం మార్కెట్ లో దొరికే ర‌క‌ర‌కాల టూత్ పేస్ట్ ల‌ను వాడుతూ ఉంటాం.

కానీ ర‌కాల టూత్ పేస్ట్ లు వాడిన‌ప్ప‌టికి దంతాలు పుచ్చిపోతూనే ఉంటాయి. అలాగే చాలా మంది రోజుకు రెండు సార్లు దంతాల‌ను శుభ్రం చేసుకుంటూ ఉంటారు. అయిన‌ప్ప‌టికి దంతాలు పుచ్చిపోతూ ఉంటాయి. అయితే దంతాలు పుచ్చిపోకుండా ఉండాలి అంటే కొన్ని రకాల ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి. మరి అందుకోసం ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. పంచ‌దారతో చేసిన తీపి ప‌దార్థాలు, చాక్లెట్లు, మైదా పిండితో చేసిన ప‌దార్థాలు, శీత‌ల పానీయాలు, టీ, కాఫీల‌ వంటి వాటికి దూరంగా ఉండాలి. ఇటువంటి ఆహారాలకు పిల్ల‌లు దూరంగా ఉండ‌లేరు.

 

ఇటువంటి ప‌దార్థాలు తిన్న‌ప్ప‌టికి దంత క్ష‌యం కాకుండా ఉండాలంటే చెరుకు ముక్క‌ల‌ను బాగా న‌మ‌లాల‌ని నిపుణులు చెబుతున్నారు. రాత్రి భోజ‌నం చేసిన త‌రువాత చెరుకు ముక్క‌ల‌ను తిన‌డం వ‌ల్ల దంత క్ష‌యం జ‌ర‌గ‌కుండా ఉంటుంది. చెరుకు ముక్క‌లు న‌మ‌ల‌డం వ‌ల్ల దంతాలు, చిగుళ్లు తాజాగా ఉంటాయి. చెరుకును న‌మిలేట‌ప్పుడు దీనిలో ఉండే ఫైబ‌ర్ దంతాలను, చిగుళ్ల‌ను శుభ్ర‌ప‌రుస్తుంది. దంత‌ క్ష‌యానికి కార‌ణ‌మ‌య్యే చెడు బ్యాక్టీరియాల‌ను న‌శింప‌జేసే యాంటీ ఆక్సిడెంట్లు చెరుకులో అధికంగా ఉంటాయి. అలాగే రోజులో సాధ్య‌మైనంత వ‌ర‌కు మొల‌కెత్తిన గింజ‌ల‌ను, దానిమ్మ గింజ‌ల‌ను, తాజా పండ్లు, కొబ్బ‌రి, ఉడికించ‌ని స్వీట్ కార్న్ గింజ‌ల‌ను, నారింజ తొన‌ల‌ను బాగా న‌మిలి తినాలి. ఇలా తిన‌డం వ‌ల్ల దంతాలు శుభ్ర‌ప‌డ‌తాయి. దంతాలకు గార‌ప‌ట్ట‌కుండా ఉంటుంది. వీటిని తిన‌డం వ‌ల్ల వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల కార‌ణంగా నోట్లో ఉండే బ్యాక్టీరియాలు న‌శిస్తాయి.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -