TEA: తలనొప్పితో సతమతమవుతున్నారా? ఈ టీ ట్రై చేయండి!

TEA: నేటి కాలంలో చాలా మంది ఒత్తిడితో కూడిన పని చేస్తూ నిత్యం బిజీగా గడుపుతుంటారు. బిజీ లైఫ్, బిజీ పని.. అలసిపోయి ఇంటికి చేరుతుంటారు. ఇలాంటి సమయంలో ఓ చక్కటి కాఫీ లేదా టీ తాగితే కాస్త రిలాక్స్ అవుతారు. మంచి ఫీలింగ్ కలుగుతుంది. పని ఒత్తిడి ఎక్కువగా ఉంటే చాలా మందికి తలనొప్పి వచ్చేస్తుంటుంది. ఇలాంటి సందర్భాల్లో తలనొప్పి నుంచి బయట పడాలంటే అల్లంతో తయారు చేసిన టీ తాగాలి.

క్షణాల వ్యవధిలో తలనొప్పి తగ్గుతుంది..

అల్లం, చమోమిలి రెండూ నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతాయి. టెన్షన్ పడే మైండ్ సెట్ ను సరిచేస్తాయి. తలనొప్పిని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. వీటిలోని ఔషధ గుణాలు తలనొప్పిని పరిష్కరించి బిగ్ రిలీఫ్ ఇస్తాయి. అలర్జీలను కూడా నయం చేసే శక్తి వీటికి ఉంటుంది. మెదడును ఆరోగ్యంగా చేస్తాయి.

పొట్టలో ఉబ్బసం లాంటి సమస్యను తగ్గిస్తాయి. ఈ టీలో వాము కూడా కలిపి తాగితే జీర్ణక్రియ మెరుగవుతుంది. తులసి, చమోమిలికి ఆందోళన తగ్గించే పవర్ కూడా ఉంటుంది. కాబట్టి అల్లం స్పెషల్ టీ తయారు చేసుకొని ట్రై చేయండి. ఈ టీ తయారు చేసుకోవడానికి రెండు కప్పుల నీళ్లు, ఓ అంగుళం అల్లం ముక్క, తులసి ఆకులు కొన్ని, ఓ టీ స్పూన్ వాము, అర టీస్పూన్ చామంతి పూలు, పుదీనా ఆకులు, తేనె అవసరం అవుతాయి.

మొదటగా స్టవ్ మీద ఓ గిన్నె పెట్టుకొని 2 కప్పుల నీళ్లు పోయండి. బాగా మరిగాక అల్లం, తులసి ఆకులు వేయండి. తర్వాత వాము, చామంతి, పిప్పరమెంటు ఆకులు వేయాలి. ఐదు నిమిషాలపాటు మరిగించాలి. తర్వాత ఓ కప్పులోకి తీసుకోవాలి. ఇందులో కొద్దిగా తేనె కలిపి టీ కప్పులో సర్వ్ చేసుకొని ఓ సోఫాలోనో కుర్చీలోనో తాపీగా కూర్చొని టీ తాగితే… ఇక ఎలాంటి తలనొప్పి అయినా పారిపోవాల్సిందే.

Related Articles

ట్రేండింగ్

CM YS Jagan: ఏపీ సీఎం వైఎస్ జగన్ ఫెయిల్డ్ ముఖ్యమంత్రా.. హామీల అమలులో అట్టర్ ఫ్లాప్?

CM YS Jagan: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాల కాలంలో ఏపీ అభివృద్ధిని గాలికి వదిలేసారన్నమాట వాస్తవమే. ఇలా అభివృద్ధిని పక్కనపెట్టి ఎంతసేపు తెలుగుదేశం పార్టీ నాయకులు అధినేత...
- Advertisement -
- Advertisement -