Onion Juice: పరగడుపున ఉల్లిపాయ రసం తాగితే చాలు.. ఎన్నో లాభాలు?

Onion Juice: ప్రస్తుత రోజుల్లో చిన్న పెద్ద అని తేడా లేకుండా చాలామంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో డయాబెటిస్ సమస్య కూడా ఒకటి. ఒక్కసారి డయాబెటిస్ వచ్చింది అంటే చనిపోయే వరకు కూడా పోదు. అయితే డయాబెటిస్ ను అదుపులో ఉంచుకోవడానికి మార్కెట్లోకి ఎన్నో రకాల మెడిసిన్స్ వచ్చాయి. వాటితో పాటుగా ఎన్నో రకాల వంటింటి చిట్కాలను కూడా పాటిస్తూ ఉంటారు. డయాబెటిస్ పేషెంట్లు ప్రతి ఒక్క ఆహారం విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తలు వహించాల్సిందే. అయితే డయాబెటిస్ ను అదుపులో ఉంచుకోవడానికి ఎప్పుడు మందులే కాకుండా అప్పుడప్పుడు హోమ్ రెమిడీస్ కూడా పాటించడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి. అటువంటి వాటిలో ఉల్లిపాయ రసం ఒకటి.

 

ప్రతి రోజూ ఉదయం పరగడపుతో తీసుకుంటే రక్తంలో చక్కర స్థాయిలను 50 శాతం వరకు తగ్గించవచ్చు. అంతేకాకుండా ఈ జ్యూస్ శరీరంలో యూరిక్ యాసిడ్, కొలెస్ట్రాల్ ను త్వరగా తగ్గిస్తుంది. ఉల్లిపాయ తినడం కూడా బరువు తగ్గడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఉల్లిపాయలో ఉండే యాంటీఆక్సిడెంట్స్, క్రోమియం, అల్లైల్ ప్రొఫైల్ డైసల్ఫైడ్, రక్తంలో చెక్కర స్థాయిలను తగ్గించడానికి సహాయపడతాయి. మంచి వ్యాధినిరోధక శక్తిని ప్రోత్సహిస్తుంది. ఉల్లిపాయ తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగిన కూరగాయ. పచ్చి ఉల్లిపాయలు 10 గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటాయి, ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

ఎర్ర ఉల్లిపాయలలో పీచుపదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఉల్లిపాయలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఫైబర్ విచ్ఛిన్నం జీర్ణం కావడానికి సమయం పడుతుంది. ఫైబర్ మలబద్ధకం సమస్య నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులలో ఒక సాధారణ సమస్య అయిన మలబద్ధకాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఉల్లిపాయల్లో కార్బోహైడ్రేట్లు చాలా తక్కువగా ఉంటాయి. 100 గ్రాముల ఎర్ర ఉల్లిపాయలో దాదాపు 8 గ్రాముల కార్బోహైడ్రేట్లు ఉంటాయి. చక్కెర త్వరగా రక్తప్రవాహంలోకి విడుదల అవుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ ఆహారంలో తక్కువ కార్బోహైడ్రేట్ ఆహారాలను చేర్చుకోవాలి. అదనంగా, ఉల్లిపాయలు కేలరీలు తక్కువగా ఉంటాయి మరియు ఆరోగ్యకరమైన బరువు తగ్గించే కార్యక్రమం కోసం సురక్షితంగా పరిగణించబడతాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -