Drinking Raw Milk: పచ్చిపాలు తాగేవారు ఇవి తెలుసుకోవాల్సిందే!

Drinking Raw Milk: శరీర ఆరోగ్యానికి వివిధ రకాల పదార్థాలు, ద్రవాలు తీసుకుంటారు. చాలా మంది దాదాపుగా పాలనే ఎక్కువగా తాగుతారు. కొందరు పచ్చిపాలు పాగితే.. మరికొందరు అందులో వివిధ రకాల పౌడర్లు కలుపుకొని తాగుతారు. మరి కొందరైతే అప్పుడు పితికిన ఆవు, గేదె పాలను అప్పటికప్పుడే తాగుతారు. అలాంటి పాలు తాగితే మంచిదేనా అని కొందరిలో సందేçహాలు తలెత్తుతున్నాయి.

పచ్చి పాలల్లో వివిధ రకాల బ్యాక్టీరియాలు ఉంటాయి. ఇలాంటి పాలను తాగితే కీళ్లలో వాపు, డయేరియా, డీహైడ్రేషన్‌ వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. కొందరు పాలు పితికే సమయంలో నీళ్లు, ఇతర పదార్థాలను కలుపుతారు. అలాంటి సమయంలో అక్కడి వాతావరణాన్ని బట్టి కొన్ని మలినాలు కూడా కలుస్తాయి. అలాంటి పాలను నేరుగా తాగితే ఉదర సంబంధ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వేడి చేయకుండా అపరిశుభ్రమైన పాలు తాగితే ట్యుబర్కులోసిస్‌ అనే ప్రమాదకర జబ్బు వచ్చే ప్రమాదం ఉంటుంది. అందులోని బ్యాక్టీరియా వల్ల ఊపరితితులపై ఈ వ్యాధి ప్రభావం చూపుతుంది.

పాలలో బ్యాక్టీరియా ఉండడంతో అవి త్వరగా పాడవుతాయి. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే వారు పచ్చి పాలను తాగరాదు. అరగంట పాటు మరగబెట్టిన తర్వాతనే తాగాలి. అప్పుడే పితికిన పాలు తాగడంతో శరీరంలో ఆమ్లస్థాయి పెరిగి యాసిడిటీ, అజీర్తి వంటి సమస్యలు ప్రారంభమై వివిధ రోగాలు ప్రబలుతాయి. అందుకే పచ్చిపాలు తాగకపోవడమే మంచిదంటుంటారు. చిన్న పిల్లలకు మాత్రం అస్సలు పప్చిపాలను తాపకూడదు. వారిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి అలాంటి వారిలో తొందరగా జబ్బులు సోకే ప్రమాదం ఉంటుంది. ప్రస్తుతం పాలు కూడా అంత స్వేచ్ఛమైనవి కావు కాబట్టి వాటిని వేడి చేసే తాగాలనే వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -