Elections: ఏపీలో ముందస్తు ఎన్నికలు? దూకుడు పెంచిన పార్టీలు

Elections: ఏపీలో ముందస్తు ఎన్నికలకు రంగం సిద్దం అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏ క్షణమైనా సీఎం వైఎస్ జగన్ ఎన్నికలకు వెళ్లే ఛాన్స్ ఉందనే ఊహాగానాలు ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి. జగన్ పాలనకు ఈ ఏడాది మే 30 నాటికి మూడేళ్లు పూర్తి అయి నాలుగో ఏటలోకి అడుగుపెట్టింది. అయితే ఇటీవల వైసీపీ ముఖ్యనేత, ప్రభతుత్వ సలహాదారుడు సజ్జల రామక్రిష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చనే సంకేతాలు ఇచ్చారు. దీంతో ఏపీలో ముందస్తు ఎన్నికల టాపిక్ మరింత హీటెక్కింది.

వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే నెలలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశముందనే టాక్ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. సీఎం వైఎస్ జగన్ వరుసగా సంక్షేమ పథకాలకు సంబంధించి బటన్ నొక్కుతూ డబ్బులు విడుదల చేస్తుండటం, జిల్లాల పర్యటనకు వెళుతుండటం, నియోజకవర్గాల వారీగా వైసీపీ నేతలతో సమీక్ష నిర్వహిస్తుండటం, నేతలకు వర్క్ షాపులు నిర్వహిస్తుండటం హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉండగానే.. ఇప్పుడే జగన్ నేతలతో సమావేశాలు నిర్వహిండటం చర్చనీయాశం అవుతోంది. అందేకాకుండా అభ్యర్థులపై కూడా జగన్ క్లారిటీ ఇస్తున్నారు.

ఇటీవల గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఉండవల్లి శ్రీదేవిని కాదని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ కు నియోజకవర్గ అదనపు సమన్వయకర్తగా బాద్యతలు అప్పగించారు. పలు సర్వేలో ఉండవల్లి శ్రీదేవికి వ్యతిరేకంగా ఫలితాలు వచ్చాయని, ఆమె సీటు ఇస్తే వచ్చే ఎన్నికల్లో గెలుపొందే అవకాశం లేదని, అందుకే డొక్కా మాణిక్య వరప్రసాద్ ను తాడికొండలో రంగంలోకి దించినట్లు తెలుస్తోంది. త్వరలో వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలకు జగన్ చెక్ పెట్టి అక్కడ ప్రత్యామ్నాయ నేతలను తెరపైకి తీసుకురానున్నారు. దీనిని బట్టి చూస్తే జగన్ ముందస్తు ఎన్నికలకు వెళతారనే ప్రచారం సాగుతోంది.

ఇక టీడీపీ అధినేత చంద్రబాబు కూడా పలుమార్లు ముందస్తు ఎన్నికలపై తెలుగు తమ్ముళ్లకు సూచించారు. ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చని, సిద్దంగా ఉండాలని చెప్పారు. ఇక జనసేన ముఖ్యనేత నాదెండ్ల మనోహర్ కూడా పలుమార్లు ముందస్తు ఎన్నికలు రావొచ్చని స్పష్టం చేశారు. నేతల కామెంట్స్ తో ఏపీ ముందస్తు ఎన్నికల చర్చ జోరందుకుంది. ముందస్తు ఎన్నికలు వస్తాయనే సంకేతాలతో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ దూకుడు పెంచారు. చంద్రబాబు, లోకేష్ ఇటీవల జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టారు. పవన్ కల్యాణ్ కూడా సినిమాలను పక్కన పెట్టి పూర్తిగా రాజకీయ క్షేత్రంలోకి దిగారు.

ఇటీవల రైతు భరోసా యాత్రలతో పాటు ప్రజావాణి కార్యక్రమాలు చేపట్టారు. అలాగే అక్టోబర్ విజయదశమి నుంచి బస్సు యాత్రను పవన్ చేపట్టనున్నారు. బస్సు యాత్ర ద్వారా ప్రతి జిల్లాల్లో పర్యటించనున్నారు. అధికార వైసీపీ కూడా స్పీడ్ పెంచింది. అభ్యర్థుల ఎంపికపై జగన్ ఫోకస్ పెట్టారు. డిసెంబర్ నాటికి 175 నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎవరనే దానిపై క్లారిటీ ఇచ్చే అవకాశముందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

కాగా, ముందస్తు ఎన్నికలపై మరో వాదన కూడా వినిపిస్తోంది. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తూ సీఎం జగన్ బటన్లు నొక్కుతున్నారు తప్పితే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదు. ఇలాంటి తరుణంలో ముందస్తు ఎన్నికలకు వెళితే నష్టం తప్పితే లాభం ఉండదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి తరుణంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లకపొవచ్చని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తానికి ఏపీలో రాజకీయ పార్టీలు అయితే మాత్రం ఇప్పటినుంచే ఎన్నికలకు సన్నద్దమవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -