Ragi: రాగులు తింటే ఆ సమస్యలన్నీ మటుమాయం!

Ragi: రాగులు ఆరోగ్యానికి చాలా మంచివి. రాగులు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో వాడుతుంటారు. వాటి ద్వారా లభించే పోషకాలు విలువ తెలిసినప్పటి నుంచి అన్ని ప్రాంతాల్లో లభిస్తున్నాయి. రాగుల్లో ఉండే పోషక పదార్థాలు ఏ మెడిసిన్‌ తీసుకున్నా రానంతగా ఉంటాయి. ఆధునిక జీవితంలో వివిధ రకాల ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా అనారోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. రాగుల్లో విటమిన్లు, మినరల్స్, పొటాషియం, ఫాస్పరస్, మెగ్నీషియం, ఐరన్‌ పుష్కలంగా లభిస్తుండటంతో వాటి ప్రాముఖ్యం పెరిగింది.

రాగులను ప్రతిరోజూ ఆహారంలో భాగంగా చేసుకుంటే సత్ఫలితాలు వస్తాయి. గ్రామీణ ప్రాంతాల్లో వేసవిలో రాగి జావ తీసుకోకుండా ఉండని వారుండరు. ఎందుకంటే శరీరానికి చలువ ఇస్తోంది. శరీరంలో ఉష్ణోగ్రత తగ్గిస్తోంది. అలసట తగ్గుతుంది. మరీ ముఖ్యంగా మధుమేహం నియంత్రణలో ఉంటుంది. రాగుల్లో పుష్కలంగా ఉండే ఫైబర్‌ కారణంగా గ్లైసీమియా షుగర్‌ వ్యాధిగ్రస్తులకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తోంది. రాగుల్లో యాంటీ ఆక్సిడెంట్‌లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని కేన్సర్‌ కారకాలనను నాశనం చేస్తాయి.

మరోవైపు యాంటీ ఏజీయింగ్‌ లక్షణాలు అధికంగా ఉంటాయి కాబట్టి..క్రమం తప్పకుండా తీసుకుంటే నిత్యం యవ్వనంగా ఉంటారు. రాగులలో ఐరన్‌ పుష్కలంగా ఉండటంతో రక్తంలో హిమోగ్లోబిన్‌ స్థాయి పెరుగుతుంది. ఇందులో ఉండే ఎమైనో యాసిడ్స్‌ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. రాగుల్లో ఉండే కాల్షియం ఎముకలు పటిష్టంగా మారి కీళ్ల నొప్పులు దూరం అవుతాయి. మరీ ముఖ్యంగా పాలిచ్చే తల్లులకు రాగులు తీసుకోవడం చాలా మంచిది. రాగుల్లోని ఎమైనో యాసిడ్స్‌ బాడీని ప్రశాంతంగా చేస్తాయి. రాగులు ఓ సంపూర్ణమైన బలవర్ధకమైన ఆహారం. రాగుల్లో కాల్షియం అధికంగా ఉండటంతో కిడ్నీ సమస్యతో బాధపడేవారు రాగులు తీసుకోకూడదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -