Election Commission: ఎన్నికల్లో పోటీ చేయడానికి వీల్లేదు… తెలుగు రాష్ట్రాల్లో వారికి షాకిచ్చిన ఈసీ

Election Commission: కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. ఎన్నికల్లో పోటీ చేయకుండా తెలుగు రాష్ట్రాలకు చెందిన 157 మంది నేతలపై వేటు వేసింది. మూడేళ్ల పాటు వీళ్లు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులుగా ప్రటించింది. అసెంబ్లీ, లోక్ సభ, స్థానిక సంస్థలతో పాటు ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయడానికి వీల్లేకుండా చేసింది. తెలంగాణకు చెందిన 107 మంది నేతలు ఈ జాబితాలో ఉండగా.. ఏపీకి చెందిన నేతలు 50 మంది ఉన్నారు. అసెంబ్లీ లేదా లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసి ఎన్నికలు ముగిసిన తర్వాత ఎన్నికల్లో ఎంత ఖర్చు చేశారనే వివరాలను పోటీ చేసిన అభ్యర్థులందరూ ఈసీకి వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. ప్రచారం, క్యాడర్ కోసం, ఇతర పనుల కోసం ఎంత ఖర్చు చేశారనే వివరాలను డీటైల్డ్ గా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కానీ తెలుగు రాష్ట్రాలకు చెందిన 157 మంది నేతలు ఎన్నికల ఖర్చు వివరాలను ఈసీకి అందించలేదు. ఇప్పటివరకు ఖర్చు వివరాలను తెలపలేదు.

దీంతో ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 10-ఏ ప్రకారం ఎన్నికల ఖర్చు వివరాలను తెలపని వారు ఎన్నికల్లో మూడేళ్ల పాటు పోటీ చేయకుండా అనర్హలుగా ఈసీ ప్రకించింది. దీనికి సంబంధించి తాజగా ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ అసెంబ్లీ లేదా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి ఖర్చుల వివరాలను సమర్పించని నేతలు 107 మంది ఉన్నారు. అసెంబ్లీకి పోటీ చేసి ఖర్చల లెక్కలు ఇవ్వనివారు 36 మంది, లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసి తెలపనివారు 72 మంది ఉన్నారు. ఇక ఏపీ అసెంబ్లీకి పోటీ చేసి ఖర్చు వివరాలు తెలపని వారు 42 మంది, లోక్ సభకు పోటీ చేసి ఖర్చు వివరాలు చెప్పనివారు 8 మంది ఉన్నారు.

దేశం మొత్తం మీద ఎన్నికల్లో పోటీ చేసి ఖర్చుల వివరాలు సమర్పించని వారు 1073 మంది ఉన్నట్లుీఈసీ గుర్తించింది. అత్యధికంగా బీహార్ నుంచి 174 మంది ఉన్నారు. ఆ తర్వాత రెండో స్థానంలో తెలంగాణు చెందిన నేతలు ఉన్నారు. దీంతో మొత్తం దేశవ్యాప్తంగా 1073 మంది అభ్యర్థులపై మూడేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలు లేకుండా అనర్హత వేటు వేస్తూ ప్రకటన జారీ చేసింది.వీళ్లందరూ ఏ ఎన్నికల్లో పోటీ చేయడానికి కుదరదని ఈసీ ఉత్తర్వుల్లో పేర్కొంది.

కాగా ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు తమ ఖర్చు వివరాలన్నింటిని పొందుపర్చి ఓ పత్రంలో ఈసీకి సమర్పించాల్సి ఉంటుంది. ప్రచారం కోసం, సిబ్బంది వసతి, ప్రచారం కోసం వాహనాలు, ఇతర ఖర్చుల వివరాలు మొత్తం చెప్పాల్సి ఉంటుంది. వీటిని ఈసీ పరిశీలించి తమ వద్ద నివేదికలు ఉంచుకుంటుంది. కానీ చాలామంది నేతలు నిర్లక్ష్యంగా ప్రదర్శిస్తున్నారు. ఏమీ కాదులే అనే భరోసాతో ఈసీకి ఖర్చుల వివరాలు సమర్పించడం లేదు. అలాంటి వారిపై ఈసీ ఇప్పుడు కఠిన చర్యలకు దిగింది. నిర్లక్షంగా వ్యవహిరస్తే కఠిన చర్యలకు వెనుకాడబోమని దీని ద్వారా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఈసీ సంకేతాలు పంపినట్లు అయింది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -