Eggs: శీతాకాలంలో గుడ్డు తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా?

Eggs: గుడ్డు తినడం వల్ల అనేక లాభాలు ఉన్నాయనే విషయం మనకు తెలిసిందే. రోజుకో ఎగ్ తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. ఎగ్‌లో అనేక పోషకాలు ఉంటాయి. అందుకే ఎగ్ తినేందుకు చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. కొంతమంది నాన్ వెజిటేరియన్స్ చికెన్ తినరు కానీ ఎగ్ తింటూ ఉంటారు. శరీరానికి పోషకాల కోసం ఎగ్ తింటామని కొంతమంది నాన్ వెజిటేరియన్స్ చెబుతూ ఉంటారు. అయితే గుడ్డు తినడం వల్ల ఎలాంటి పోషకాలు అందుతాయనేది ఇప్పుడు చూద్దాం.

శీతాకాలంలో ఎగ్ తినడం వల్ల ఇంకా చాలా మంచిదని, సీజనల్, ఇన్పెక్షన్ వ్యాధుల నుంచి బయటపడవచ్చని చెబుతున్నారు. శీతాకాలంలో ప్రతిఒక్కరికీ జలుబు, దగ్గు, ఇన్పెక్షన్స్ వంటివి ఎక్కువగా వస్తాయని, గుడ్డు తినడం వల్ల వాటిని ఎదుర్కొవచ్చని చెబుతున్నారు. గుడ్డు తినడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుందని, దీని వల్ల చలికాలంలో వచ్చే ఇన్పెక్షన్ల నుంచి త్వరగా బయటపడే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఇమ్యూనిటీ పెంచుకోవడంలో గుడ్డు చాలా ఉపయోగపడుతుందని చెబుతున్నారు.

ఇక పొద్దున్నే చలిగా ఉండటం వల్ల చాలామంది బయటకు వచ్చేందుకు ఇష్టపడరు. దీని వల్ల ఎండలో ఉండకపోవడం వల్ల డి విటమిన్ లోపం వచ్చే అవకాశం ఉంటుంది. గుడ్డులో ఉండే పోషకాలు డి విటమిన్ ను అందిస్తాయని సైంటిస్టులు చెబుతున్నారు. గుడ్డులో దాదాపు 8.2 ఎమ్‌సిజి విటమిన్ డి ఉంటుందని చెబుతున్నారు.

ఇక ఎగ్‌లో విటమిన్ ఏ,బి2, బి5,బి12,బి6, డి,.ఇ,కె విటమిన్లతో పాటు జింక్, ఐరన్, ఫోలేట్, క్యాల్షియం లాంటి మినరల్స్, అమైనో యాసిడ్ ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని చెబుతున్నారు. అలాగే ప్రొటీన్లు గుడ్డులో చాలా ఉంటాయని, దీని వల్ల శరీరానికి ప్రోటీన్లు ఎక్కువ అందుతాయని చెబుతున్నారు. చలికాలంలో గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుందని, అయితే గుడ్డును తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్‌ను కరిగిస్తుందని, దీని వల్ల గుండెకు ఎంతో మేలు చేస్తుందని చెబుతున్నారు.

ఇక గుడ్డులో జింక్ ఎక్కువగా ఉంటుంది. చలికాలంలో వచ్చే జలుబు, ఫ్లూ వంటి వాటి నుంచి జింక్ రక్షణ కల్పిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇక గుడ్డులో విటమిన్ బీ6,బీ12 ఎక్కువగా ఉంటాయని, చలికాలంలో వచ్చే హానికరమైన బ్యాక్టీరియా, వైరస్ ల నుంచి ఇవి కాపాడతాయని చెబుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -