GPS Pension System: జీపీఎస్ వల్ల ఉద్యోగులకు రిటైర్మెంట్ తర్వాత నరకమేనా.. దీని వల్ల ఇన్ని నష్టాలు ఉన్నాయా?

GPS Pension System: ప్రభుత్వ ఉద్యోగంలో కొనసాగుతున్నటువంటి ఉద్యోగులకు తాము అధికారంలోకి రాగానే సిపిఎస్ రద్దు చేస్తామని ప్రకటించారు. ఇలా జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి ఈ హామీ ఉద్యోగులకు ఎంతో లాభదాయకంగా ఉంటుందని భావించి ఉద్యోగస్తులు అందరూ కూడా ఈయనకు ఓట్లు వేసి గెలిపించారు అయితే ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఇచ్చిన మాట గురించి మర్చిపోయారు.

సీఎం జగన్ రెడ్డి, సీపీఎస్ రద్దు చేస్తే అప్పులు రావని… అసెంబ్లీలో చెప్పుకున్న బుగ్గన .. జీపీఎస్ బిల్లును ఆమోదింప చేసుకున్నారు. మరి ఉద్యోగులకు ఇచ్చిన హామీ సంగతేంటి ? . ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే రాజీనామా చేయాలని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చేస్తున్నది ఏంటి అంటూ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.ఇవన్నీ పక్కన పెడితే కొత్త జీపీఎస్ బిల్లులో ఉన్న నిబంధనలు చూసిన ఉద్యోగులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఉద్యోగస్తులు తమ ఉద్యోగ రిటైర్మెంట్ పొందిన తర్వాత కూడా ప్రభుత్వానికి బానిసలుగా పని చేయాలి అంటూ కొత్త నిబంధనలను అమలులోకి తీసుకురావడంతో ఉద్యోగస్తులు మండిపడుతున్నారు. పదవి విరమణ పొందిన తర్వాత రిటైర్ అవుతున్న వారికి కండక్ట్ సర్టిఫికెట్ కావాలట. ఇంత కన్నా అవమానం ఉద్యోగులకు ఉంటుందా అని పలువురు ఈ నిర్ణయం పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సాధారణంగా ఇలాంటి బిల్లులను ఆమోదించే క్రమంలో ఉద్యోగస్తుల నిర్ణయాలు తీసుకొని ఈ విధమైనటువంటి బిల్లులను ఆమోదిస్తారు కానీ ఉద్యోగుల అనుమతి లేకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తమకు నచ్చిన విధంగా బిల్లులను ఆమోదింప చేసుకుంటున్నారు. దీంతో రిటైర్డ్ అయిన తర్వాత కూడా ఉద్యోగుల బ్రతుకులు ప్రభుత్వ అధికారుల చెప్పు చేతుల్లోనే ఉంటాయని తెలుస్తోంది. ఇదిలాగే కొనసాగితే జగన్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడుతున్నాయని చెప్పాలి అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -