Meta: వేలాది మంది ఉద్యోగులు నిరాశ్రయులయ్యేనా?.. ‘మెటా’ అంత పని చేయనుందా?

Meta: సోషల్ మీడియా దిగ్గజం మెటా ఉద్యోగులకు భారీగా షాక్ ఇవ్వనుంది. గుట్టుచప్పుడు కాకుండా వేలాది మంది ఉద్యోగులను తొలగించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. మొత్తం ఉద్యోగుల్లో 15 శాతం వరకు ఉద్యోగులు తమ పదవులను కోల్పోనున్నారు. దాదాపు 12 వేల మంది నిరాశ్రయులు కానున్నారు. దీంతో ఉద్యోగుల్లో భయాందోళన మొదలైంది. తమ ఉద్యోగాలు కోల్పోతున్నట్లు బాధ పడుతున్నారు.

మెటా సంస్థ ఇచ్చిన సమాచారం ప్రకారం.. సంస్థలో పని చేస్తున్న 15 శాతం మంది ఉద్యోగులు తమ పదవులు కోల్పోనున్నారు. దీనికి సంబంధించి సంస్థకు చెందిన సీనియర్ ఎక్సిక్యూటివ్స్ అదే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. పని, అర్హత, తదితర అంశాలను దృష్టిలో పెట్టుకుని, ఉద్యోగులను పదవి నుంచి తొలగించడం జరుగుతుంది. ఈ ప్రక్రియ త్వరలో పూర్తి కానుందని పేర్కొంది.

ఇప్పటికే సంస్థలో రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి. మరికొద్ది వారాల్లో మెటా సంస్థలోని 15 శాతం ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోనున్నట్లు సంస్థలో పనిచేసే ఎంప్లాయిలే చెబుతున్నారు. అయితే వాస్తవానికి బయటికి కనిపించేది ఏంటంటే.. ఆ ఉద్యోగులు తమకు తాము ఉద్యోగాలు మానేస్తున్నట్లు. కానీ నిజానికి వారు బలవంతంగా ఉద్యోగాలు కోల్పోయి ఇంటి బాట పడుతున్నట్లు సంస్థలో పని చేసే ఓ ఉద్యోగి తెలిపాడు.

సోషల్ మీడియా నెట్ వర్కింగ్ దిగ్గజం ఫేస్‌బుక్ హైరింగ్ ఫ్రీజ్‌ను ప్రకటించినప్పటి నుంచి ఉద్యోగాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే చాలా మంది ఉద్యోగాలు కోల్పోయినట్లు సమాచారం. అయితే గతంలో ఫేక్‌బుక్‌కు పెద్ద డిమాండ్ ఉండేది. ఒక్కో షేర్ విలువ 380 డాలర్లకు కూడా చేరుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ గతేడాది నుంచి కంపెనీ షేర్ వ్యాల్యూ 60 శాతానికి తగ్గింది. దీంతో కంపెనీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ ఉద్యోగుల్లో 15 శాతం ఉద్యోగాల్లో కోత విధించేందుకు ప్లాన్ చేస్తున్నారు. కంపెనీ అభివృద్ధికి తమ వ్యూహాలు పని చేయట్లేదని, అందుకే ఉద్యోగులు బాధ్యత వహించాలని గతంలో మెటా సంస్థ అధినేత మార్క్ జూకర్‌బర్గ్ అన్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -