Jagan: ఉద్యోగాలకు జీతాలు ఇవ్వని దుస్థితి.. జగన్ సర్కార్ ఏం చెబుతుందో?

Jagan: ఏపీలో జగన్ సర్కార్ కు ఊహించని అవమానం ఎదురయింది. ఏపీలో దాదాపుగా 8 నెలల నుంచి జీతాలకు నోచుకోని దయానియ స్థితిలో ఉన్నారు ఉద్యోగులు. దీంతో ఇప్పటివరకు ఎంతో ఓపికతో ఎదురుచూసిన ఉద్యోగులు సచివాలయ సిబ్బంది ఏపీ మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల‌ కృష్ణ చాంబ‌ర్‌కు తాళాలు వేశారు. జీతాల‌పై ఆధార‌ప‌డి జీవించే వారికీ ప్రతినెలా జీతాలు అందించాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వంపై ఉంది. కానీ ఏపీ సర్కార్ ఆ విషయాన్ని మరిచిపోయినట్టు ఉంది. మాములుగా జీతాల పైనే ఉద్యోగుల కుటుంబాల్లోని అనేక మంది ఆధార‌ప‌డి బ‌తుకుతుంటారు.

పిల్ల‌ల చ‌దువు, కుటుంబ పోష‌ణ‌, ఇంటి అద్దెలు, వైద్య ఖ‌ర్చులు ఇలా ఒకటి రెండు కాదు చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయని చెప్పవచ్చు. ఇలా అనేక అంశాలు వేత‌నాల‌తో ముడిప‌డి వుంటాయి. ఏదైనా ఇబ్బంది ఎదురైతే ఒకట్రెండు నెల‌లు ఉద్యోగులు జీతం లేకపోయినా నెట్టుకొచ్చే ప‌రిస్థితి వుంటుంది. అలా కాకుండా నెల‌ల త‌ర‌బ‌డి జీతాలు అంద‌కపోతే ఇరుగుపొరుగు వారు అప్పుడు ఇవ్వడం కూడా మానేస్తారు. దాంతో ఆ ఉద్యోగుల పరిస్థితి వర్ణనతీతం. వారంతా ఎలా బ‌తుకీడుస్తారో క‌నీస మాన‌వ‌త్వంతో ఆలోచించ‌క‌పోవ‌డం దారుణం.

 

మంత్రి వేణుగోపాల‌కృష్ణ‌ పేషీలో పనిచేస్తున్న ఏడుగురు సిబ్బందికి 8 నెల‌లుగా జీతాలు అంద‌కపోవ‌డంతో స‌హాయ నిరాక‌ర‌ణ‌కు దిగారు. వీరంతా చిన్న‌చిన్న ఉద్యోగులు కావ‌డం గ‌మ‌నార్హం. వీరికి కాపు, బీసీ కార్పొరేషన్ల నుంచి జీతాలు అందేలా ఏర్పాట్లు చేశారు. కానీ జీతాలు మాత్రం అంద‌లేదు. త‌మ గోడును మంత్రితో పాటు ఉన్న‌తోద్యోగుల‌కు చెప్పినా వినిపించుకోలేదు. దీంతో మంత్రి చాంబర్‌కు తాళాలు వేశారు. కార్యాల‌యం వైపు ఉద్యోగులు క‌న్నెత్తి చూడ‌క‌పోవ‌డంతో ఈ వ్య‌వ‌హారం వైర‌ల్ అవుతోంది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ ఇవ్వడంతో చాలామంది జగన్ పై ఏపీ సర్కార్ పై మండిపడుతున్నారు..

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -