AP CM Jagan: ఉద్యోగుల జీవితాలను మార్చే దిశగా ఏపీ సీఎం జగన్ అడుగులు.. కానీ?

AP CM Jagan: ఎన్నికలు దగ్గర పడుతుండటంతో రాజకీయ చదరంగం మహా జోరుగా ఆడుతున్నారు సదరు రాజకీయ నాయకులు. ఇన్నాళ్లు కనీసం మొహాలు చూడటానికి కూడా ఇష్టపడని వాళ్లు కూడా ఎన్నికలు దగ్గర పడటంతో కానివాళ్ల కాళ్లు పట్టుకోవడానికి కూడా వెనకడుగు వేయడం లేదు. ఇప్పుడు అదే కోవలో జగన్మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్నాడు. ఇంతకీ విషయం ఏమంటే ఎన్నికల్లో గెలవడం కోసం ఉద్యోగులతో అవసరం లేదనుకున్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వాళ్ళ ఓట్ల కోసం వాళ్ళ డిమాండ్లను తీర్చటంలో ఆసక్తి చూపిస్తుంది.
 ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రులు భేటీ అవుతున్నారు. వారి సమస్యలు వినటానికి గంటల గంటలు సమయాన్ని కేటాయిస్తున్నారు. ఇదంతా ఎందుకయ్యా అంటే వచ్చే ఎన్నికలలో వారి ద్వారా వచ్చే ఓట్ల కోసం అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. వీడు ద్వారా వచ్చే ఓట్లన్నీ వదులుకోవడానికి ఇష్టపడని ప్రభుత్వం వారి ఆర్థికపరమైన డిమాండ్ల విషయంలో ఆచి తూచి వ్యవహరిస్తుంది. ఈనెల 21, 22 తేదీల్లో విజయవాడలో జరగబోయే ఏపీ ఎన్జీవో రాష్ట్ర మహాసభల్లో పాల్గొనేందుకు జగన్ కూడా ఓకే చెప్పారు.
 ఈ సందర్భంగా పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రి బాద్షా సత్యనారాయణ పాల్గొన్నారు. నిజానికి ఆర్థిక అంశాలను పరిష్కరించడానికి ప్రభుత్వం దగ్గర తగినంత డబ్బు లేదు అందుకే ఆర్థిక ప్రయోజనాలను అమలు చేయడంలో ప్రభుత్వం వీలైనంత సమయాన్ని తీసుకుంటుంది. ఈ విషయం ఉద్యోగ సంఘాల నేతలకు ఉద్యోగులకి కూడా తెలుసు. అయినా ప్రభుత్వం ఇదంతా ఉద్యోగస్తుల ద్వారా వచ్చే 20 లక్షల ఓట్లు కోసం.
 నిజమేనండి అక్షరాల 20 లక్షల ఓట్లు ఉద్యోగుల ద్వారా వస్తున్నాయి ఎలా అంటే సుమారు 5 లక్షల మంది ఉద్యోగులు. రిటైర్ అయిన వారు మరొక నాలుగు లక్షల మంది మొత్తం తొమ్మిది లక్షల మంది వీరి కుటుంబ సభ్యులను లెక్క పెట్టుకుంటే మొత్తం 20 లక్షల కోట్లు అవుతున్నాయి చూస్తూ చూస్తూ అన్ని లక్షలని వదులుకోవటం ఇష్టంలేని జగన్ ప్రభుత్వం ఉద్యోగులని మంచి చేసుకోవడానికి సర్వత్రా ప్రయత్నిస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -