Prabhas-Anushka: ప్రభాస్ కు పెళ్లి చేసి కూతురిని కూడా పుట్టించిన ఫ్యాన్స్.. ఈ ఫోటోలు చూస్తే షాకవ్వాల్సిందే!

Prabhas-Anushka:  టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ ఆ తర్వాత వరుసగా పాన్ ఇండియా సినిమా లలో నటిస్తూ దూసుకుపోతున్నారు. అయితే కెరియర్ పరంగా దూసుకుపోతున్న ప్రభాస్ వ్యక్తిగత విషయాల గురించి మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా ఆయన పెళ్లి విషయం గురించి ఎప్పటికప్పుడు దాటవేస్తూనే వస్తున్నారు. ఆయన పెళ్లి పై అభిమానులు ఎన్నో రకాల ఆశలు పెట్టుకుంటుండగా అవన్నీ ఎప్పటికప్పుడు నిరశపరుస్తూ వస్తున్నారు ప్రభాస్.

ఆయన ఎప్పుడెప్పుడు ఒక ఇంటివాడవుతాడా అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. బాహుబలి సినిమా అంతకంటే ముందు నుంచి కూడా ప్రభాస్ పెళ్లి వార్త ఎప్పుడెప్పుడు చెప్తాడా అని ఎదురుచూస్తున్నారు. కానీ పెళ్లి విషయంలో మాత్రం ప్రభాస్ అభిమానులకు నిరాశ ఎదురవుతూనే ఉంది.

ఇది ఇలా ఉంటే ఇప్పటివరకు ప్రభాస్ పెళ్లి వార్త ఇక చెప్పడు అని నిర్ణయానికి వచ్చిన ప్రభాస్ అభిమానులు ప్రభాస్ కి పెళ్లి చేసి పాపను కూడా పుట్టించేశారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. ఇంతకీ ప్రభాస్ అభిమానులు ఏం చేశారంటే.. ప్రభాస్, అనుష్క పెళ్లి చేసుకుంటే బాగుంటుందని ఆశ పడుతుంటారు.

ప్రభాస్ అండ్ అనుష్క కలిసి ఇప్పటికి నాలుగు సినిమాల్లో నటించారు. ఆన్ స్క్రీన్ ఈ జంట ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. ఈ రోజుల్లో AI టెక్నాలజీ ఉపయోగించి నెటిజెన్స్ ఏవేవో అద్భుతాలు చేస్తున్నారు. ఈక్రమంలోనే ప్రభాస్ ఫ్యాన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ సహాయం తీసుకోని అనుష్కతో ప్రభాస్ కి పెళ్లి చేసేశారు. అయితే పెళ్లితో మాత్రమే ఆగలేదు.

వారిద్దరికీ ఒక పాపని కూడా పుట్టించేశారు. ఇక ఇందుకు సంబంధించిన ఫోటోలను #Pranushka అంటూ వైరల్ చేస్తున్నారు. ఇక వీటిపై మీమర్స్ ఫన్నీ మీమ్స్ చేస్తుండగా అవి చూసిన ఫాలోయర్స్ నవ్వుకుంటున్నారు. ఈ ఫోటోలను చూసిన తర్వాత అయినా ప్రభాస్ పెళ్లి గురించి స్పందిస్తాడేమో చూడాలి మరి అంటూ అభిమానులు ఎంతో ఆశగా కామెంట్ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -