Mahesh: కెరీర్ లో తొలిసారి అలాంటి తప్పు చేసిన మహేష్ బాబు.. అభిమానులు సైతం మండిపడేలా?

Mahesh: మాములుగా అప్పుడప్పుడు హీరోలు తీసుకునే నిర్ణయాలు అభిమానులకు కోపం తెప్పిస్తూ ఉంటాయి. అలా ఈ మధ్యకాలంలో స్టార్ హీరోలు సినిమాల విషయంలో చాలా బోల్డ్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. కథ నచ్చక పోతే నచ్చలేదు డైరెక్ట్ గానే డైరెక్టర్స్ కి చెప్పేస్తున్నారు. అంతేకాదు హిట్ ట్రాక్ లేని డైరెక్టర్స్ కు ఏ స్టార్ హీరో ఛాన్స్ ఇవ్వడం లేదు. ఇప్పుడు పాన్ ఇండియా హీరోలుగా స్టార్ హీరోలుగా కమిట్ అయిన అందరి హీరోలు హిట్ డైరెక్టర్లతోనే సినిమాకి కమిట్ అవుతున్నారు తప్పిస్తే ఫ్లాప్ కొట్టిన డైరెక్టర్ తో ఒక్కరు కూడా కమిట్ అవ్వలేదు. దీంతో కొత్త దర్శకులకు అలాగే ఫ్లాప్ డైరెక్టర్లకు అవకాశాలు లేక సతమతమవుతున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు వద్దకు వచ్చిన భారీ ఆఫర్ ని సైతం డైరెక్టర్ కారణంగా రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం గుంటూరు కారం సినిమా షూట్ లో బిజీ బిజీగా ఉన్న మహేష్ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత మహేష్ బాబుతో సినిమాను తెరకెక్కించాలని వరుస ఫ్లాప్స్ తన ఖాతాలో వేసుకున్న మెహర్ రమేష్ వెయిట్ చేస్తున్నారట. రీసెంట్గా ఒక మంచి కథతో ఆయన వద్దకు వెళ్లారట. కథ నచ్చిన కానీ మహేష్ బాబు మెహర్ రమేష్ కి ఉన్న ట్రాక్ రికార్డ్ చూసి భయపడిపోయి రిజెక్ట్ చేశారట. అసలే రాజమౌళితో సినిమాలో నటించిన తర్వాత ఏ సినిమా చేసిన ఫ్లాప్ అవుతుందనే బ్యాడ్ సెంటిమెంట్ ఒకటి ఉంది.

ఆ విధంగా చూసుకుంటే ఈ సినిమా ద్వారా మరింత స్థాయిలో తన కెరియర్ నాశనం అయిపోతుంది అని ఆయన కథ నచ్చినా మహేష్ బాబు రిజెక్ట్ చేశాడు అని ఓ న్యూస్ వైరల్ అవుతుంది. అయితే కొందరు మహేష్ బాబు తీసుకున్న నిర్ణయం పై నెగిటివ్గా స్పందిస్తున్నారు. ట్రాక్ రికార్డు ఇంపార్టెంట్ కాదు కధ ఇంపార్టెంట్ ఛాన్స్ ఇవ్వచ్చుగా అంటూ సజెస్ట్ చేస్తుంటే మరికొందరు మాత్రం వద్దు బాబోయ్ వద్దు ఆ ఛాన్స్ నువ్వు ఇవ్వద్దు కెరియర్ రిస్క్ లో పెట్టొద్దు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -