Mahesh: మహేష్ మూవీ హీరోయిన్ అందానికి ఫిదా అవ్వాల్సిందే.. క్యూట్ అంటూ?

Mahesh: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు త్వరలోనే గుంటూరు కారం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత మహేష్ బాబు తన తదుపరి చిత్రాన్ని రాజమౌళి దర్శకత్వంలో చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా ఓ అడ్వెంచర్స్ మూవీగా భారీ బడ్జెట్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది.

 

ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ కూడా పూర్తి అయిందని తెలుస్తోంది. ఇక మహేష్ బాబు గుంటూరు కారం పూర్తి అయిన తర్వాత రాజమౌళి సినిమాతో బిజీ కాబోతున్నారు. రాజమౌళి సినిమా అంటే అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వస్తుంది అనే సంగతి మనకు తెలిసిందే. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈయన నటీనటులను కూడా అదే స్థాయిలో పాపులారిటీ ఉన్నటువంటి వారిని ఎంపిక చేసుకుంటారు.

ఇకపోతే రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో రాబోతున్న సినిమాలో హీరోయిన్ ఎవరు అనే విషయం గురించి గత కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే నటించబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా మరో నటి పేరు తెరపైకి వచ్చింది.

 

మహేష్ బాబు సినిమా కోసం రాజమౌళి ఇండోనేషియా బ్యూటీని రంగంలోకి దింపుతున్నట్టు సమాచారం. త‌న పేరు… చెల్సియా ఇస్లాన్. కొన్ని హాలీవుడ్ చిత్రాల్లో న‌టించింది. ఇటీవ‌ల ఆమెను స్క్రీన్ టెస్ట్ కూడా చేశార‌ని, ఈ సినిమాలో ఆమె రాక దాదాపు ఖాయ‌మ‌ని తెలుస్తోంది. చెల్సియాని క‌థానాయిక పాత్ర కోసం ఎంచుకొన్నారా, లేకపోతే సినిమాలో ఏదైనా కీలక పాత్రలో నటించడం కోసం ఆమెను ఎంపిక చేసుకున్నారా అన్న విషయం తెలియదు కానీ ఈమె మాత్రం రాజమౌళి సినిమాలో దాదాపు ఖరారు అయిందని వార్తలు హల్చల్ చేస్తున్నాయి.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -