Jr NTR: ఎన్టీఆర్ కాస్త ఆలోచించవయ్యా అంటూ ఎన్టీఆర్ అభిమానులు!

Jr NTR: టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. నటనలో తాతకు తగ్గా మనవడుగా ఒక గుర్తింపు సంపాదించుకున్నాడు. అలా పలు సినిమాల్లో నటించి స్టార్ హీరో స్థాయికి ఎదిగాడు. ఇక ఇటీవల రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ సినిమా ద్వారా ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ వరల్డ్ వైడ్ గా రెండు ప్రాజెక్టులతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాడు.

ఇదిలా ఉంటే ఎన్టీఆర్ అభిమానుల్లో రోజురోజుకీ ఆందోళన ఎక్కువైపోయింది. ఎందుకంటే కారణం ఎన్టీఆర్ తర్వాత రాబోయే సినిమా గురించి ఇంకా ఆలోచిస్తూనే ఉన్నాడు. తన తోటి స్టార్ హీరోలు అందరూ పలు వరుస ప్రాజెక్టులతో షూటింగ్ షెడ్యూల్లో బిజీగా ఉన్నారు. దాదాపు మూడు నెలల గ్యాప్ లోనే మహేష్ బాబు ఒక కొత్త సినిమాలో నటించడానికి సిద్ధమవుతున్నాడు. ఇక అల్లు అర్జున్ విషయానికొస్తే పుష్ప పార్ట్ టు తో సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది.

ఇక రామ్ చరణ్ ఆర్ సి 15 సినిమాతో షూటింగ్ నేపథ్యంలో దూసుకుపోతున్నాడు. ఇక ఇదే క్రమంలో ప్రభాస్ చేతిలో కూడా కొన్ని సినిమా ఆఫర్లు ఉన్నాయన్నట్టు తెలుస్తుంది. కానీ ఎన్టీఆర్ ఇప్పటికీ ఇంట్లోనే ఉన్నాడు. ఇది గమనించిన ఎన్టీఆర్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. కొరటాల శివ ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఒక ప్రాజెక్టు వస్తున్న సంగతి మనకు తెలిసిందే.

ఈ ప్రాజెక్టు పేరుతో ఎన్టీఆర్ ఎప్పుడు షూటింగ్ లోకి అడుగు పెడతారా అన్నట్లు ఎన్టీఆర్ అభిమానులు వేచి చూస్తున్నారు. నిజానికి ఎన్టీఆర్ సంవత్సరం నుంచి ఖాళీగానే ఉంటున్నాడు. ఇక ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో లో వచ్చే ప్రాజెక్టు కోసం వెయిట్ లాస్ పనిలో పడ్డట్లు తెలుస్తుంది. ఎందుకంటే అప్పుడప్పుడు ఎన్టీఆర్ కొత్త లుక్ లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయినప్పటికీ ఫ్యాన్స్ ఎన్టీఆర్ ఎప్పుడు షూటింగ్ లోకి వెళతాడని అభిమానులు ఎదురుచూస్తున్నాను. అందుకే ఎన్టీఆర్ ను అభిమానులు కాస్త ఆలోచించవయ్యా అని రిక్వెస్ట్ పెడుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -