Farmer: వరి రైతులకు అదిరిపోయే శుభవార్త ఇదే.. ఈ పంట వేస్తే బెటర్!

Farmer: ప్రస్తుత కాలంలో వ్యవసాయం చేసే వారి సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది అయితే పలుచోట్ల వ్యవసాయం చేస్తున్నప్పటికీ వేసిన పంట చేతికి అందుతుందో లేదో అన్న ఆందోళనలో కూడా చాలామంది రైతులు ఉంటారు. పంట బాగా పండి చేతికి వచ్చిన తర్వాత అకాల వర్షాల కారణంగా తీవ్ర స్థాయిలో అన్నదాతలు నష్టాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితిలో ఏర్పడుతున్నాయి. కళ్ళముందే పంట నీటి కొట్టుకుపోతుంటే ఆ రైతుల ఆవేదన వర్ణాతీతం అని చెప్పాలి.

ఇలా ఎంతోమంది రైతులు చేతికి అందిన ముద్దను జారవిడ్చుకున్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి అయితే ప్రభుత్వాల నుంచి సహాయం అందని కారణంగా రైతులకు పంటలు పండిన పండకపోయినా నష్టాలను మాత్రం ఎదుర్కొంటున్నారు.అయితే వానలు వచ్చినా వరదలు వచ్చిన ఏమాత్రం గింజ కూడా పక్కకి కదలని సరికొత్త వంగడాలను రైతులకు అందుబాటులోకి తీసుకువస్తున్నారు శాస్త్రవేత్తలు. ఇలా అందుబాటులోకి వచ్చిన సరికొత్త రకం వరి ద్వారా రైతులు ఎలాంటి ఆందోళన చెందకుండా నిశ్చింతగా ఈ పంట ద్వారా లాభాలను పొందవచ్చు.

 

ఈదురు గాలులు వచ్చిన వడగండ్ల వానలు వచ్చిన కాండం విరగకుండా గింజ నేల రాలకుండా ఉండే సరికొత్త వంగడాలు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటికే జేజీఎల్ 24423వంగడం అందుబాటులోకి వచ్చింది. అయితే వచ్చే ఏడాదిలో మరికొత్త వంగడాలను రైతులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. అయితే ఈ వంగడం ఎలాంటి వానలకు అయినా తట్టుకొని నిలబడగల సత్తా ఉందని చెప్పాలి.

 

పంట ముందుగానే పూర్తి అయ్యేవిధంగా అతి తక్కువ పంట కాల సమయంతో అధిక దిగుబడిని అందిస్తుంది.ఇక ఈ వంగడం రకం ఎలాంటి ఈదురుగాలులకైనా తట్టుకొని నిలబడటమే కాకుండా రైతులకు ఎలాంటి నష్టం లేకుండా అధిక దిగుబడితో లాభాలను పొందవచ్చు.అయితే ప్రస్తుతం నాలుగు రకాల వంగడాలు అందుబాటులో ఉన్నాయి. వచ్చే ఏడాదిలో మరికొన్ని వంగడాలను కూడా రైతులకు అందుబాటులోకి తీసుకురానున్నారు ఇలాంటి సరికొత్త వంగడాల ద్వారా రైతులు నష్టపోకుండా పంటలు పండిస్తూ లాభాలను అందుకోవచ్చు.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -