Devotional: మీపై శని ప్రభావం ఉందో లేదో తెలుసుకోండిలా?

Devotional: శనీశ్వరుడు చాలామంది ఈ పేరు వినగానే భయపడిపోతూ ఉంటారు. శనీశ్వరుడి ఆలయానికి వెళ్ళాలి అన్నా శని దేవుడిని పూజించాలి అన్నా కూడా భయపడుతూ ఉంటారు.కానీ చాలామందికి తెలియని విషయమేమిటంటే శని దేవుని అనుగ్రహం లభించింది అంటే ఎంతటి బీదవాడైనా కోటీశ్వరుడు కావాల్సిందే. అలాగే శనిదేవుడు ఆగ్రహిస్తే ఎంతటి కోటీశ్వరుడైన బీదవాడు కావాల్సిందే. నవగ్రహాల్లో అత్యంత శక్తివంతమైన గ్రహం శని. శని దేవుని వాహనం కాకి. శనీశ్వరుడు 12 రాజుల్లో సంచారం పూర్తి చేయడానికి దాదాపుగా 30 సంవత్సరాల సమయం పడుతుంది.

అంటే 30 ఏళ్లకు ఒకసారి ప్రతి ఒక్కరిపై ఏలినాటి శని ప్రభావం ఉంటుందన్నమాట. మూడు రాశుల్లో శని ఏడున్నర సంవత్సరాలు సంచరించడానికి ఏలినాటి శని అని అంటారు. ఒకవేళ శని 12 వ రాశిలో సంచరిస్తే. వ్యవహారాల్లో చిక్కులు, వ్యాపారాల్లో ఒడిదుడుకులు, ఊహించని మార్పులు, అనారోగ్యం, ఔషధ సేవనం, తరచూ ప్రయాణాలు వంటివి జరుగుతూ ఉంటాయి. అదేంటి శని జన్మరాశిలో సంచరిస్తే.. ఆరోగ్యభంగం, నీలాపనిందలు, భాగస్వాములతో వైరం, మనశ్శాంతి లోపం, ధనవ్యయం, రుణబాధలు, వృత్తి, వ్యాపారాల్లో చికాకులు, స్థానచలన సూచనలు వంటివి కలుగుతాయి. అంతేకాకుండా శని మూడు రకాలు.

 

అందులో ఒకటి మంగు శని.. అంటే జీవితంలో మొదటిసారి వచ్చే ఏలినాటి శనిని మంగు శని అంటారు. రెండవది పొంగు శని.. 30 ఏళ్ల తర్వాత వచ్చే ఏలినాటి శనిని పొంగు శని అని అంటారు. మూడవది మృతి శని.. మూడోసారి వచ్చే శనిని మృత్యు శని అని అంటారు. ఆ సమయంలో అనారోగ్య సమస్యలు, అపమృత్యుభయం ఎదుర్కొంటారు. అయితే జాతకచక్రంలో శని మంచి స్థితిలో ఉన్నప్పుడు గోచారంలో గురు బలం ఉన్నప్పుడు ఏల్నాటి శని అంతగా బాధించడు. ఈ దోషాలు ఉన్న వారు శనికి తైలాభిషేకం చేయడం, శ్రమ చేయడం చేయడం ద్వారా కొంత ఉపశమనం పొందుతారు. శని శ్రమ కారకుడు కాబట్టి శ్రమకారక జీవులైన చీమలకు పంచదార, తేనె వేయడం వల్ల శనిబాధల నుంచి ఉపశమనం లభిస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -