Astrology: ఈ సంకేతాలు కనిపిస్తే శని ప్రభావమే.. ఈ తప్పులు చేస్తే మాత్రం దరిద్రం చుట్టుకుంటుందా?

Astrology: నవగ్రహాల్లో ఒకటైన శని గ్రహానికి ఎంత విశిష్టత ప్రత్యేక స్థానం ఉందో మనందరికీ తెలిసిందే. శని గ్రహాన్ని న్యాయానికి అధిపతిగా పండితులు అంటారు. ఎవరైతే మంచి పనులు చేస్తూ ఉంటారో అటువంటి వారికి ఆ శనీశ్వరుని అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. అదేవిధంగా ఎవరైతే తరచూ తప్పుడు పనులు చేస్తూ అబద్ధాలు చెబుతూ ఉంటారు అటువంటి వారికి ఆ శనిశ్వరుడు కష్టాలు ఇవ్వడంతో పాటు వారిపై కన్నెర్ర చేస్తూ ఉంటాడు. చెడ్డ పనులు చేసే వాళ్ళకి శని చెడు ఫలితాలని కలిగిస్తాడు.

ఆ విధంగా శని మంచి, చెడు కర్మ ఫలాలను మనకి ఇస్తూ ఉంటాడు. ప్రతి వ్యక్తి జాతకంలో శని ఉచ్ఛస్థితి అనేది ఉండడం జరుగుతుంది. శని చెడు స్థానంలో ఉంటే వ్యక్తుల జీవితంలో రకరకాల మార్పులు వస్తూ ఉంటాయి. అయితే శని ప్రభావం ఏ విషయాల పై పడుతుంది అనే ముఖ్య విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మాంసాహారం తీసుకోవడం లేదంటే మద్యం తీసుకోవాలని కోరిక ఎక్కువ ఉన్నట్లయితే శని ప్రభావం మీ పై పడుతుంది. శని మహర్దశ ప్రారంభమవుతుందని మీరు గమనించాలి. మాంసాహారం మానేసి శాకాహారం తింటే శని ప్రభావం తగ్గుతుంది.

 

అదేవిదంగా మీ అరచేతి రంగు మారిపోవడం మొదలైతే శని ప్రభావం పడుతున్నట్లు గమనించాలి. నీలం రంగులోకి అరచేతి మారిపోయి నల్ల మచ్చలు కనిపిస్తూ ఉంటాయి. అలా జరిగితే శని మీపై కోపంతో ఉన్నట్లు మీరు గమనించాలి. ఎప్పుడైనా మీ పాదరక్షలను ఎవరైనా దొంగలిస్తే అది కూడా శని ప్రభావం అని తెలుసుకోవాలి. శని అనుగ్రహం కోసం శనివారం రోజు నల్లని రంగులో ఉండే పాదరక్షలను దానం చేయాలి. ఇదివరకు ఉపయోగించిన చెప్పులని ఇవ్వకూడదు. కొత్తవి ఇవ్వాలి. ఇంట్లో కానీ ఫ్యాక్టరీలో లేదంటే దుకాణంలో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగితే అది శని ఆగ్రహం అని గ్రహించాలి.

Related Articles

ట్రేండింగ్

Jagan Campaigners For TDP: టీడీపీకి జగన్ రెడ్డి స్టార్ క్యాంపెయినర్.. నమ్మకపోయినా వాస్తవం మాత్రం ఇదే!

Jagan Campaigners For TDP: వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ స్టార్ క్యాంపెయినర్ గా మారిపోయారు. ప్రజలు నమ్మిన నమ్మకపోయినా ఇదే వాస్తవమని తెలుస్తోంది చంద్రబాబు నాయుడు సూపర్...
- Advertisement -
- Advertisement -