Venkaiah Naidu: పొలిటికల్ రీఎంట్రీపై వెంకయ్య క్లారిటీ.. రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు

Venkaiah Naidu: వెంకయ్య నాయుడు అంటే దేశవ్యాప్తంగా తెలియని వారు ఎవరూ ఉండరు. తెలుగు రాష్ట్రాల్లో ఆయన ఇక ఎంతో పాపులర్. సౌత్ ఇండియాలో వెంకయ్యకు మరింత మంచి పేరుంది. ఏపీలోని నెల్లూరు జిల్లాకు చెందిన వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతిగా పనిచేయడం తెలుగువారందరికీ గర్వకారణమని చెప్పవచ్చు. బీజేపీలో చిన్న కార్యకర్త నుంచి అంచెలంచెలుగా ఆయన ఎదగారు. ఆంధ్రా ఉద్యమంలో జైలుకి కూడా వెళ్లారు. ఎమ్మెల్యేగా, బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తర్వాత కేంద్రమంత్రిగా, ఉపరాష్ట్రపతిగా పనిచేశారు. ఇలా ఒక్కొ మెట్టు ఎక్కుకుంటూ దేశంలోనే ప్రముఖ నేతగా ఆయన ఎదిగారు.

వెంకయ్య నాయుడు మంచి వాగ్దాటి, మాటకారి. చమత్కారం, తెగువ అన్నీ ఉన్నాయి. బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తన వాగ్దాటితో కాంగ్రెస్ నేతలకు పార్లమెంట్ లో వెంకయ్య చెమటలు పట్టించేవారు. తన స్పీచ్ తో అదరగొట్టేవారు. ఏ భాష అయినా సరే ఆయన అనర్గళంగా మాట్లాడేవారు. జాతీయ నేతగా ఎదగడానికి అది కూడా ఆయనకు ప్లస్ గా మారింది. బీజేపీ నేతలందరితో ఆయనకు మంచి పరిజయాలు, సత్సంబంధాలు ఉన్నాయి. అది కూడా బీజేపీలో ముఖ్యనేతగా ఎదగడానికి ఆయనకు పాజిటివ్ గా మారాయని చెప్పవచ్చు.

పలువుర ప్రతిపక్ష నేతలతో కూడా ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయి. దీంతో రాజకీయంగా అజాతశత్రువుగా వెంకయ్య నాయుడిని అన్ని పార్టీలు భావిస్తాయి. అందరివాడుగా ఆయనను పార్టీలన్నీ భావిస్తాయి. అందుకే ఉపరాష్ట్రపతి ఎన్నికల సమయంలో అన్ని పార్టీలో ఆయనకు మద్దతు ప్రకటించాయి. అయితే ఇటీవల ఉపరాష్ట్రపతి పదవికి వెంకయ్య నాయుడు పదవీ విరమణ చేసిన విషయం తెలిసిందే. పదవీకాలం ముగియడంతో పదవీ విరణ చేశారు.

ఒకసారి ఉపరాష్ట్రపతి పదవి చేపట్టిన తర్వాత రాజకీయ పదవులన్నీ వదులుకోవాల్సి ఉంటుంది. రాజకీయ జీవితానికి దూరంగా ఉండాల్సి ఉంటుంది. ఇప్పుడు ఉపరాష్ట్రపతిగా పదవీ విరమణ చేయడంతో వెంకయ్య నాయుడు మళ్లీ రాజకీయాల్లోకి అడుగు పెడతారా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఆయన తిరిగి రాజకీయాల్లోకి రావాలని చాలామంది కోరుతున్నారు. ఈ క్రమంలో దీనిపై వెంకయ్య నాయుడు క్లారిటీ ఇచ్చారు.

తిరిగి రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన అసలు లేదని వెంకయ్య స్పష్టత ఇచ్చారు. రాజ్యాంగబద్దమైన పదవిలో కొనసాగిన తర్వా తిరిగి రాజకీయాల్లోకి రావడం మంచిది కాదని తెలిపారు. తిరిగి ప్రజా జీవితంలోకి వస్తానని, ప్రజలకు దగ్గరగా ఉంటానని చెప్పారు. కానీ రాజకీయాలకు మాత్రం పూర్తిగా దూరంగా ఉంటానని వెంకయ్య తెలిపారు. రాజ్యాంగబద్దమైన పదవిలో కొనసాగినప్పుడు కొన్ని నిబంధలు ఉంటాయని, దానికి కట్టుబడి ఉండాల్సి ఉంటుందన్నారు.

ఇప్పుడు ఆ నిబంధనలు ఏమీ లేవని, తిరిగి ప్రజా జీవితంలోకి అడుగుపెడతానన్నార. తన అభిప్రాయాలను నిర్మోహమాటంగా చెబుతానని, రాజకీయాల్లోకి మాత్రం వచ్చే ప్రసక్తే లేదన్నారు. రాజ్యాంగబద్దమైన పదవులు చేపట్టిన తర్వాత ఎవరైనా సరే రాజకీయాల్లోకి తిరిగి అడుగుపెట్టడం మంచిది కాదన్నారు.

ఉపరాష్ట్రపతిగా పదవీ విరమణ పొందిన నేపథ్యంలో నార్సింగ్ సమీపంలోని ఓ కన్వెన్షన్ హాల్ లో రాజకీయ, వ్యాపార, సినీ, కళా, ఇతర రంగాల్లోని తన స్నేహితులు, ప్రముఖులతో ఆత్మీయ సమావేశం వెంకయ్య ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పొలిటికల్ రీ ఎంట్రీపై ఆయన స్పందించారు. తాను ప్రజాజీవితంలో ఉంటానని, తనకు తెలిసిన విషయాలను యువత, మహిళలు, రైతులతో పంచుకుంటానని వెల్లడించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేయడం తనకు లభించిన అదిపెద్ద అవకాశాల్లో ఒకటని, తన జీవితంలో ఆ సమయం ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పారు.

రాజకీయ నాయకులు వ్యక్తిగత దూషణలకు దూరంగా ఉండాలని సూచించారు. ప్రజాప్రతినిధులు ఇతరులకు ఆదర్శంగా ఉండాలని, చట్టసభల్లో వ్యక్తిగత దూషణలు చేయడం సరికాదన్నారు. చట్టసభల్లో ప్రజా సమస్యలపై వాడివేడిగా చర్చలు జరగాలని, వ్యక్తిగత దూషణలపై కాదని వెంకయ్య తెలిపారు. చట్టసభల్లో ఉన్నప్పుడు ఎంతోమంది పెద్దలను కలుసుకుని వారి నుంచి ఎంతో నేర్చుకున్నానని వెంకయ్య పేర్కొన్నారు. వ్యక్తిగత దూషణలు చేయకపోతే రాజకీయంగా వెనుకబడి పోతావేమోనని, మీడియా ఫోకస్ ఉండదేమోనని చాలామంది అనుకుంటారని, ఆ ధోరణి అసలు మంచిది కాదని వెంకయ్య చెప్పారు.

వెంకయ్య తిరిగి రాజకీయాల్లోకి వస్తారేమోనని చాలామంది భావించారు. ఇప్పుడు ఆయన స్వయంగా క్లారిటీ ఇవ్వడంతో ఇక ఆ టాపిక్ కు ఎండ్ కార్డు పడినట్లు అయింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -