Chandrababu: ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మారాలంటే చంద్రబాబు రావాల్సిందే….!

Chandrababu: నవ్యాంధ్ర ఏర్పడ్డ తర్వాత తొలిముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించారు. చంటి బిడ్డలాంటి రాష్ట్రాన్ని ఒక తండ్రిగా అభివృద్ధి చేసుకుంటూ వచ్చారు. ప్రజలందరికీ చేరువయ్యే విధంగా అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేసి అక్కడ ప్రభుత్వ కార్యకలాపాలను ప్రారంభించారు. రైతులందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అమరావతి రాజధాని కోసం భూములిచ్చి చంద్రబాబుకు సహకారం అందించారు. అలాగే నూతనంగా ఏర్పడ్డ నవ్యాంధ్ర రాష్ట్రంలో హైదరాబాదును మించిన మహా రాజధాని నిర్మించాలని చంద్రబాబు కూడా సంకల్పించారు. రాయితీలు కల్పిస్తామని పెట్టుబడులను పరిశ్రమలను ఆహ్వానించి యువతకు ఉపాధి కల్పించాలని ప్రయత్నించారు. ఉన్న ఐదేళ్లలో ఉన్న బడ్జెట్లోనే ప్రజలందరికీ సంక్షేమం అభివృద్ధి అందిస్తూ మరోపక్క రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటూ ప్రణాళికలు రచిస్తూ తనకున్న 40 ఏళ్ల అనుభవాన్ని వాడుకుని ఒక రూపానికి తీసుకువచ్చారు.

 

అయితే 2019 ఎన్నికల్లో జరగడం ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డికి మొగ్గుచూపి ఆయన అధికారంలోకి రావడంతో ఇక్కడ చిత్రం మారిపోయింది. జగన్మోహన్ రెడ్డి రావడంతోనే రివర్స్ టెండరింగ్ అంటూ జరుగుతున్న పనులన్నీ ఆపేసి తన సొంత కంపెనీలకు సొంత వారికి ఇచ్చుకున్నారు. జగన్మోహన్ రెడ్డి అడుగుపెట్టిన తర్వాత అప్పటివరకు అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్న రాష్ట్రం ఒక్కసారిగా నిలిచిపోయింది.

సంక్షేమ పేరుతో ప్రభుత్వ ఆస్తులు అమ్మడం మొదలుపెట్టారు. దొరికిన కాడ దొరికినట్లు దోచుకోవడం మొదలుపెట్టారు. రాష్ట్రంలో ఒక్క రోడ్డు వేయలేదు… ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నారు అది లేదు… పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తామన్నారు దానికి సంగతే లేదు… అమరావతి రాజధాని అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒప్పుకుని మళ్ళీ అధికారంలోకి వచ్చాక మూడు రాజధానులు తెరమీదకు తీసుకువచ్చి విశాఖపట్నంలో భూములు దోచుకోవడానికి మాస్టర్ ప్లాన్ వేశారు. పేదవాడికి ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో దానికి రెండింతలు లాక్కోవడం మొదలుపెట్టింది ఈ జగన్ సర్కార్. ప్రతిపక్ష నాయకుల పైన దాడులు అక్రమ కేసులు ఎదురు తిరిగితే చంపేయడం లాంటి దుర్మార్గాలకు కూడా పాల్పడుతున్నారు ఈ వైసీపీ నాయకులు. ప్రతిపక్ష నాయకులను మంత్రులతో బూతులు తిట్టించడం వారి కుటుంబ సభ్యులను కించపరిచేలా మాట్లాడి నిందలు వేయడంలో ఆరితేరిపోయారు. యధా రాజా తథా ప్రజా అన్నట్టు తమ నాయకుడు అలా ఉంటే ఆ పార్టీలో ఉండే కార్యకర్తలు కూడా అలాగే ఉంటారు.

 

ఇలా నాలుగున్నర ఏళ్ళు గడిచిపోయాయి. మళ్ళీ ఇప్పుడు ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. దోచుకున్న డబ్బును మళ్ళీ ప్రజలకు పంచి అధికారులకు రావాలని ప్రయత్నిస్తున్న జగన్ ఒకవైపు…. అభివృద్ధికి ఆమడ దూరంలో ఆగిపోయిన ఆంద్రాని మళ్లీ ఊపిరి పోయాలని చూస్తున్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ మరోవైపు. ఈసారి ప్రజలందరూ ఈ నాలుగేళ్లలో జరిగిందంతా చూశారు. ఆంధ్ర అభివృద్ధి కావాలని ప్రతిపక్షంలో ఆకాంక్షిస్తున్నారు. ఈసారి టిడిపి జనసేన కూటమి వస్తే ఒక విజన్ తో రాష్ట్రం ముందుకు వెళ్తుంది… ఈ జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం వస్తే మరో ముప్పై ఏళ్లు వెనక్కి వెళ్ళిపోతుంది.

Related Articles

ట్రేండింగ్

Pithapuram: పిఠాపురంలో ఫుల్ సైలెంట్ అయిన ఓటర్లు.. మద్దతు ఏ పార్టీకి అంటే?

Pithapuram:  ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రత్యర్థుల మీద మాటల దాడి చేస్తూ తమ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు రాజకీయ నాయకులు. ఆ పార్టీ ఈ పార్టీ అనే కాకుండా ప్రతి పార్టీ వారు తమ...
- Advertisement -
- Advertisement -