Gannavaram: గ‌న్న‌వ‌రం నేత టీడీపీలోకి.. ఏపీ సీఎం జగన్ పరువు గంగలో కలిసినట్టేనా?

Gannavaram: గన్నవరం వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు టీడీపీ లో చేరబోతున్నట్లుగా తెలుస్తుంది. ఆదివారం దీనిపై నిర్ణయం ప్రకటిస్తారని సమాచారం. గన్నవరంలో కార్యకర్తలతో రేపు వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు సమావేశం నిర్వహించనున్నారు. 2019లో టీడీపీ తరఫున వల్లభనేని వంశీ వైసీపీ తరఫున యార్లగడ్డ లో పోటీ చేశారు. ఎమ్మెల్యే వంశీ వైసీపీకి మద్దతు తెలిపినప్పటి నుంచి ఆ ఇద్దరు నేతల మధ్యన గొడవ జరుగుతూనే ఉంది.

దీని గురించే కీలక నిర్ణయం తీసుకోవడం కోసం ఆదివారం సమావేశం నిర్వహించనున్నారు. కార్యకర్తల సమావేశం తర్వాత యార్లగడ్డ నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు ఆయన సన్నిహితులు. వైసీపీ టికెట్ ఆశిస్తున్నా అది రాకపోవడంతో టీడీపీలోకి యార్లగడ్డ వెళ్తున్నారని చెబుతోంది క్యాడర్. యార్లగడ్డ టీడీపీ లోకి వెళ్తారని సోషల్ మీడియా సైతం జోరుగా ప్రచారం చేస్తుంది.

 

ఇదే జరిగితే సీఎం జగన్ పరువు గంగలో కలిసినట్లే. గన్నవరం నియోజకవర్గంలో పార్టీ మరింత బలహీనపడుతుందనే చెప్తున్నారు రాజకీయ వర్గాల వారు. నారా లోకేష్ చేస్తున్న యువ గళం పాదయాత్ర త్వరలోనే గన్నవరం నియోజకవర్గంలోకి అడుగుపెట్టనుంది. ఈ సందర్భంగా యార్లగడ్డ లోకేష్ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకోవటానికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు రాజకీయ వర్గాల సమాచారం. అందుకే ఆయన ఆత్మీయ అనుచరులతో సమావేశం నిర్వహించి బెంచ్ సర్కిల్ నుంచి గన్నవరం వరకు ర్యాలీ నిర్వహించాలని భావిస్తున్నట్లు ఆయన సొంత వర్గం వారే చెబుతున్నారు.

 

ఇదేగాని జరిగితే వంశీ గెలుపు ఈసారి అంతా ఈజీ కాదు. వంశీ వచ్చే ఎన్నికలలో వైసీపీ తరఫున ఇక్కడ నుంచి పోటీ చేయనున్నారు. ఆది నుంచి ఇక్కడ వైసీపీ ని డెవలప్ చేసామని.. తమకే టికెట్ ఇవ్వాలని యార్లగడ్డ కొన్నాళ్లుగా అది స్థానానికి చెప్తూనే ఉన్నారు. అయినప్పటికీ వెంకట్రావుకి అధిష్టానం ఎలాంటి అభయం ఇవ్వకపోవడంతో ఇలాంటి కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం టీడీపీకి గన్నవరంలో ఎలాంటి ఇన్చార్జి లేకపోవడం గతంలో ఉన్న బచ్చుల అర్జునుడు మృతి చెందిన తరుణంలో యార్లగడ్డ టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.

 

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -