Gannavaram: గన్నవరం నియోజకవర్గంలో గెలుపెవరిది.. వల్లభనేని వంశీ హ్యాట్రిక్ సాధిస్తారా?

Gannavaram: ఏపీలో ఎన్నికల హీట్ పెరిగిపోతుంది. ఇప్పటికే నామినేషన్ ప్రక్రియలు ప్రారంభం కావడంతో పలువురు నామినేషన్ దాఖలు చేశారు. ఇకపోతే ఏపీ రాజకీయాలలో కృష్ణ జిల్లాలలో గన్నవరం నియోజకవర్గం కూడా ఎంతో కీలకంగా ఉందని చెప్పాలి. గన్నవరం ఎప్పుడూ కూడా టిడిపికి కంచుకోటగా ఉంది. 2014- 19 ఎన్నికలలో ఈ నియోజకవర్గము నుంచి టిడిపి విజయకేతనం ఎగరవేసింది.. ఈ రెండుసార్లు జరిగిన ఎన్నికలలో భాగంగా తెలుగుదేశం పార్టీ నుంచి వల్లభనేని వంశీ ఎమ్మెల్యే అభ్యర్థిగా విజయం సాధించారు.

2019వ సంవత్సరంలో రాష్ట్రమంత వైసిపి గాలి వీస్తున్న కూడా గన్నవరంలో మాత్రం టిడిపి జెండా ఎగిరింది అయితే అతి తక్కువ మెజారిటీతో గత ఎన్నికలలో గెలుపు సాధించినటువంటి ఎమ్మెల్యే వల్లభినేని వంశీ ఈసారి అదే నియోజకవర్గం నుంచి వైసీపీ పార్టీ తరఫున పోటీ చేస్తూ గెలుపు కోసం కృషి చేస్తున్నారు. ఈసారి ఎలాగైనా ఇక్కడ వైసిపి జెండాను ఎగరవేసే హ్యాట్రిక్ కొట్టాలని అధికార నేతలు కూడా భావిస్తున్నారు.

ఇలా టిడిపి నుంచి వైసీపీలోకి వచ్చి టికెట్ అందుకున్నటువంటి వల్లభనేని వంశీకి పోటీగా గత ఎన్నికలలో వైసిపి నుంచి పోటీ చేసే స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన యార్లగడ్డ వెంకట్రావు టిడిపి చెంతకు చేరారు .దీంతో ఈయనకు గన్నవరం టికెట్ ఇవ్వడంతో రెండు పార్టీల మధ్య పెద్ద ఎత్తున పోటీ ఏర్పడింది. అయితే గన్నవరంలో పార్టీలు ఏదైనా తాము వంశీకే మద్దతుగా నిలుస్తున్నామని పలువురు చెబుతున్నారు అంతేకాకుండా మరోవైపు యార్లగడ్డకు గత ఎన్నికలలో ఓడిపోవడంతో ప్రజల మధ్యనే ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉండటంతో ఈయనకు మరింత కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఇలా ఆర్థికంగా ఇద్దరు ఎంతో బలమైన నేతల కావడం విశేషం. అంతేకాకుండా వంశి గత ఎన్నికలలో స్వల్ప మెజార్టీతో గెలవడం యార్లగడ్డకు ప్రస్తుతం కలిసి వచ్చే అంశంగా మారిందని చెప్పాలి ఇక వంశీకి జగన్ పథకాలు లబ్ధి చేకూరు వస్తున్నాయని కూడా చెప్పాలి మొత్తానికి గన్నవరం నియోజకవర్గంలో రెండు పార్టీ నేతల మధ్య గట్టి పోటీనే ఉండబోతుందని తెలుస్తుంది. మరి ఈసారి ఈ ఎన్నికలలో ఇక్కడ ఏ పార్టీ జెండా ఎగరబోతోంది అనేది తెలియాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -