Ganta Vs Botsa: బొత్స సత్యనారాయణకు షాకివ్వబోతున్న గంటా.. విశాఖకు గంట గుడ్ బై చెప్పడం ఖాయమేనా?

Ganta Vs Botsa: ఒక్క దెబ్బకు రెండు పిట్టల సామెత వినే ఉంటాం. కానీ, ఒక దెబ్బకు లెక్కలేనన్ని పిట్టలు అన్నట్టుంది చంద్రబాబు వ్యూహాం. మాజీ మాంత్రి గంటను అస్త్రంగా ప్రయోగించి టీడీపీలో ఉన్న సమస్యలకు చెక్క పెట్టడమే కాకుండా.. వైసీపీ గుండెల్లో గుబులు పుట్టించాలని చూస్తున్నారు. గంటా శ్రీనివాస్ రావు ఓటమి ఎరుగని నేత. రెండున్నర దశాబ్ధాలుగా రాజకీయం చేస్తున్న గంట శ్రీనివాస్.. నాలుగు సార్లు అసెంబ్లీకి, ఓ సారి పార్లమెంటకు ఎన్నికయ్యారు. అయితే, ఆయన రాజకీయ జీవితం మొత్తం విశాఖ జిల్లాలోనే నడించింది. అయితే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆయన్ని విజయనగరానికి మార్చాలని చూస్తున్నారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి గంటాను పోటికి ఆదేశించే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.

దీనికి చాలా కారణాలు ఉన్నాయి. విశాఖ టీడీపీలో గంటా వర్సెస్ అయ్యన్న పాత్రుడిగా రాజకీయం ఉంటుంది. ఇద్దరూ ఒకే పార్టీలో ఉన్నా.. ఒకరిపై ఒకరు కత్తులు దూస్తూనే ఉంటారు. అయ్యన్న పాత్రుడు పార్టీకి నిబద్దత కలిగిన నేతగా ఉంటారు. గంటా పలు పార్టీలు మారినా ఆర్థికంగా బలంగా ఉన్నారు. చంద్రబాబుపై వ్యక్తిగతమైన అభిమానం ఉంటుంది. దీంతో.. చంద్రబాబు వీరిద్దరి విషయంలో ఆచీతూచీ అడుగులు వేస్తారు. అయితే, ఈ సారి విశాఖ జిల్లాలో గంటా వర్సెస్ అయ్యన్న పాత్రుడు అనే రాజకీయం నడవకుండా ఉండాలి అంటే గంటాను జిల్లా మార్చాలని నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇక గంటాను చీపురుపల్లి నుంచి పోటీ చేయించాలని చూస్తున్నారు. అక్కడ వైసీపీ అభ్యర్థిగా బొత్స ఉన్నారు. ఒకప్పుడు టీడీపీ కంచుకోటగా ఉన్న చీపురుపల్లి.. 2004నుంచి బొత్స పోటీ తర్వాత కాంగ్రెస్, వైసీపీకి అనుకూలంగా మారిపోయింది. అక్కడ టీడీపీ అభ్యర్థిగా కిమిడి నాగార్జున ఉన్నాడు. నాగార్జున యువకుడు, ఉత్సాహవంతుడు అయినప్పటికీ బొత్సను ఎదుర్కొని నిలబడటం కష్టమనే అభిప్రాయం ఉంది. దీంతో.. గంట అయితే, గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చంద్రబాబు భావించారట. ఇక, రాబిన్ శర్మ సర్వేలో కూడా ఇదే విషయం తేలిందట.

అశోక్ గజపతిరాజు కానీ, తన కుమార్తె కానీ విజయనగరం ఎంపీగా పోటీకి పెద్దగా ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది. దీంతో.. నాగార్జునను ఎంపీగా దించితే అక్కడ గెలిచే అవకాశం ఉందని సమాచారం. విజయనగరం ఎంపీగా వైసీపీ నేత బెల్లాన చంద్రశేఖర్ ఉన్నారు. ఆయనపై స్థానికంగా తీవ్రమైన వ్యతిరేకత ఉంది. కిమిడి నాగార్జున .. బెల్లాన చంద్రశేఖర్‌పై ఈజీగా గెలుస్తారని స్థానిక పరిస్థితులు తెలియజేస్తున్నాయి. గంటా మార్పు ప్రభావం విశాఖ వైసీపీ ఎంపీ స్థానంపై కూడా పడుతుంది. విశాఖ వైసీపీ ఎంపీగా బొత్స సత్యనారాయణ భార్య ఝాన్సీ పోటీ చేస్తున్నారు. చీపురుపల్లిలో గంటా పోటీ చేస్తే.. ఆయన్ని ఎదుర్కోవడానికి బొత్స తన సాయశక్తులన్నీ చీపురుపల్లిపైనే పెట్టాల్సి వస్తుంది. తన భార్యపోటీ చేస్తున్న విశాఖపై కేంద్రీకరించలేరు. బొత్స దూకుడును తగ్గించాలంటే.. చీపురుపల్లిలోనే పోటీ చేస్తే బాగుంటుందని టీడీపీ శ్రేణులు భావిస్తున్నారు.

వీటితో పాటు.. ప్రస్తుతం గంటా ప్రాతినిథ్యం వహిస్తున్న విశాఖ ఉత్తరం బాధ్యతలు తనవేనని బాలకృష్ణ రెండో అల్లుడు భరత్ ప్రకటించారు. అది కూడా గంటా సమక్షంలోనే చెప్పారు. ఇప్పటికైతే ఆయన విశాఖ ఎంపీగా పోటీ చేస్తారని వార్తలు వస్తున్నాయి. కానీ, బీజేపీతో పొత్తు కుదిరితే ఆ స్థానాన్ని టీడీపీ వదులుకోవాల్సి ఉంటుంది. అప్పుడు భరత్ విశాఖ ఉత్తరం నుంచి పోటీ చేస్తారనే ప్రచారం కూడా ఉంది. ఇలా.. చాలా సమస్యలకు గంటా శ్రీనివాస్ అనే అస్త్రాన్ని వాడి పరిస్కారం చూపించనున్నారు చంద్రబాబు. ఏదీ ఏమైనా చీపురుపల్లిలో గంటా పోటీ ఖాయమైతే పోరు రసవత్తరంగా ఉంటుంది. గంటా, బొత్స ఇద్దరూ సమ ఉజ్జీలు కావడంతో రాష్ట్ర రాజకీయాల్లో చీపురుపల్లి హాట్ సీటుగా మారుతుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -