Botsa Satyanarayana: మాజీ సైనికుడి భూమిని కబ్జా చేసిన బొత్స సత్యనారాయణ.. అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉందా?

Botsa Satyanarayana: మంత్రి బొత్స సత్యనారాయణ ఏపీ రాజకీయాల్లో ఓ కీలమైన నేత. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి పదవి చేతులు వరకు వచ్చి చేజేరిపోయింది. పరిస్థితులు ఎలా ఉన్నా విజయనగరం జిల్లాలో ఆయన తన పట్టును కోల్పోకుండా వచ్చారు. కాంగ్రెస్‌లో చిన్న కార్యకర్తగా జీవితాన్ని ప్రారంభించిన ఆయన రాష్ట్ర రాజకీయాలను శాసించేవరకూ వెళ్లారు. రాజకీయంగా ఆయన ఎదుగుదలకు పరోక్షం టీడీపీనేత అశోక్ గజపతిరాజు అనే చెప్పాలి. టీడీపీలో విజయనగరం జిల్లా రాజకీయాలను అశోక్ గజపతిరాజు శాసిస్తూ ఉంటారు. అయితే, ఆయన చట్టం తన పని తను చేసుకుపోతుంది అనే రకమైన వ్యక్తి. ఎవరికి వ్యక్తిగతంగా సాయం చేయరు. ఓ ఉద్యోగం ఇప్పించడం, ఓ కాంట్రాక్టు ఇప్పించడం లాంటి పనులు చేయరు. రూల్స్ ప్రకారం ఏది ఎవరికి రావాలో వాళ్లకే వస్తుందని అంటారు.

రూపాయి కూడా ఖర్చు చేయకుండా రాజకీయం చేస్తారు. అయితే, ఇదే బొత్స సత్యనారాయణకు అవకాశంగా మారింది. 2004 కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బొత్స కమీషన్లు తీసుకొని ఉద్యోగాలు వేశారనే ఆరోపనలు ఉన్నాయి. అంతేకాదు.. ఆయన దగ్గరకు వెళ్తే ఏ పని అయినా అయిపోతుందనే ప్రచారం ఉంది. కాకపోతే ప్రతీ పనికి ఓ రేట్ ఉంది. మరోవైపు కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు వోక్స్ వ్యాగన్ కుంభకోణం ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. విజయనగరంలో ఎవరు ఏ బిజినెస్ చేయాలన్నా.. ఆయన పర్మిషన్‌తో పాటు, బిజినెస్‌లో ఆయనకు పర్సంటేజ్ కూడా ఉండాలని అడుగుతారట. దీతో పాటు భూ కబ్జాలు లాంటి ఆరోపణలు కూడా చాలానే ఉన్నాయి. ఏకంగా ఉత్తరాంధ్రలో బొత్స ఫ్యామిలీ 2 వేల ఎకరాలు భూ కబ్జా చేసిందనే అపవాదు ఆయన మూటగట్టుకున్నారు. అయితే, ఇప్పుడు 4.75 ఎకరాల భూమి విషయంలో ఆయన చిక్కుల్లో పడినట్టు తెలుస్తోంది.

2 వేల ఎకరాల భూమి ఆక్రమించుకున్న బొత్స… నాలుగు ఎకరాల భూమిని మేనేజ్ చేయలేరా అనే అనుమానం రావొచ్చు. కానీ, ఆ 4.75 ఎకరాల భూమి కూడా మాజీ సైనికుడిది కావడంతో ఆయన చిక్కుల్లో పడినట్టు తెలుస్తోంది. బొత్స ఫ్యామిలీ తన భూమికి కబ్జా చేశారని బాధితుడు ప్రధాని కార్యాలయానికి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. ఆ మాజీ సైనికుడు తన ఫిర్యాదులో భూమికి చెందిన వివరాలతో పాటు తన భూమిని ఆక్రమించుకున్నారని మంత్రి బొత్స, ఆయన మేనల్లుడు చిన్న శ్రీను, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ పేర్లు ప్రస్తావించారు. ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్న ప్రధాని కార్యాలయం రాష్ట్ర ప్రభుత్వానికి, చిత్తూరు కలెక్టర్ కు లేఖ రాసి.. ఈ ఘటనపై విచారణ జరపాలని ఆదేశించింది. అంతేకాదు.. ఆ ఆరోపణల్లో నిజం ఉంటే వారిపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. కానీ, రాష్ట్ర ప్రభుత్వం పీఎంఓ నుంచి వచ్చిన లేఖ బయటకు రాకుండా తొక్కిపెట్టినట్టు తెలుస్తోంది.

పీఎంఓ రాష్ట్ర ప్రభుత్వానికి జనవరి 12న లేఖ రాసింది. కానీ, ఇప్పటి వరకూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో పీఎంఓ సీరియస్ అయినట్టు తెలుస్తోంది. ఈ వివాదంపై కేంద్రమే ఓ కమిటీ వేసినట్టు ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే బొత్స రాజకీయంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే.. విచారణ మొదలు పెడితే.. మాజీ సైనికుడికి చెందిన 4.75 ఎరకాలతో ఆగిపోయే పరిస్థితి లేదు. బొత్సాకు చెందిన కబ్జాలు అన్ని బయటకు వచ్చే అకాశం ఉంది. కాబట్టి బొత్స వర్గంలో ఇప్పుడు ఆందోళన మొదలైనట్టు తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -