Botsa Satyanarayana: ప్రశాంత్ కిషోర్ కూడా ప్యాకేజీ స్టార్.. బొత్స సత్యనారాయణ చెప్పిన మాటలు నిజమవుతాయా?

Botsa Satyanarayana: ఉన్నది చెబితే ఉడుకెక్కువ అన్నట్టు ఉంది వైసీపీ నేతల వ్యవహారం. ఏపీలో వైసీపీ ఓటమి ఖాయమని చెప్పిన ప్రశాంత్ కిశోర్‌పై వైసీపీ నేతలు భగ్గుమంటున్నారు.. ఒకరొకరుగా రియాక్ట్ అవుతూ పీకేపై నిప్పులు కురిపిస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ ని బీహర్ నుండి తరిమికొడితే .. ఇక్కడికి వచ్చి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుత్నారని ప్రశాంత్‌కిషోర్‌ని టార్గెట్ చేస్తోంది వైసీపీ. బొత్స సత్యనారాయణ అయితే కొంచె ఇంగ్లీష్ కూడా కలిపి వాట్ నాన్‌సెన్స్ అంటూ తన స్టైల్లో చికాకు పడిపోతున్నారు. అక్కడితో ఆగారా.. గత ఎన్నికల్లో పీకే వ్యూహాలు ఫాలో అయిఉంటే నిండా మునిగిపోయే వారిమని కూడా అన్నారు. ఆయన వ్యూహాలు సరిగా లేవు కాబట్టే ఆయన్ని వ్యూహకర్త డ్యూటీ నుంచి పీకేసామని చెప్పారు.

పీకేపై వరుస విమర్శలతో పాటు.. ఎవరు వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడినా వాళ్ల వెనక చంద్రబాబు ఉంటారని అనడం అలవాటు కాబట్టి బొత్సా ఆ మాట కూడా అనేశారు. అక్కడితో ఆగకుండా అలవాట్లో పనిగా పీకే ఓ పెయిడ్ ఆర్టిస్ట్ అని విమర్శించారు. బొత్స కామెంట్స్ పై ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో ఇంట్రస్టింగ్ డిస్కషన్ జరుగుతోంది. పీకేకి అంత సీన్ లేదన్నపుడు వైసీపీ ఎందుకు అంతగా రియాక్ట్ అవుతుందనే చర్చ నడుస్తోంది. వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడిన ప్రతీ ఒక్కరిపై పెయిడ్ ఆర్టిస్టులు అని ముద్రవేయడం ఆ పార్టీ నేతలకు వెన్నతో పెట్టిన విధ్య. స్వయానా జగన్ చెల్లెలకే ప్యాకేజ్ స్టార్ అని సజ్జలు ముద్రవేశారు. అలాంటిది ప్రశాంత్ కిశోర్ ను వదులుతారా? కానీ.. వైసీపీ ఇక్కడే ఓ సమాధానం చెప్పాలి. 2019 ఎన్నికలకు ముందు పీకే వైసీపీకి ఫ్రీ సర్వీస్ చేశారా? అప్పుడు కూడా వైసీపీ వందల కోట్లు ముట్ట జెప్పింది కదా? మరి పీకే ఇప్పుడే ప్యాకేజ్ స్టార్ ఎందుకు అయ్యాడు? ఎప్పుడైనా రాజకీయాల్లో విమర్శలను స్వీకరించడం రావాలి. అది రాకపోతే భవిష్యత్ ఉండదు. విమర్శలను స్వీకరించకుండా విమర్శించిన వారిపై ఎదురుదాడి చేస్తామంటే ఎవరికి నష్టం? వైసీపీకే నష్టం.

ఇప్పటికే ఆ పార్టీకి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అందుకే ఆ పార్టీ నేతలకు ఆ ఫ్రస్టేషన్. వైనాట్ వన్ సెవన్టీ ఫైవ్ అంటూ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న సీఎం జగన్ జగన్ కు పీకే మాటలకు కాస్త కష్టంగానే ఉంటాయి. కానీ, వాస్తవాలను గ్రహించుకోకపోతే మరిన్ని తలనొప్పులు ఎదుర్కోవాల్సి వస్తుంది. సంక్షేమ పథకాలే శ్రీరామరక్షగా భావిస్తూ తిరిగి అధికారంలోకి వస్తామని జగన్ అనుకుంటున్నారు. గత ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ కంటే ఇంకా ఎక్కువ దక్కించుకుంటాన్న నమ్మకంతో కనిపిస్తున్నారు. కానీ ప్రశాంత్ కిషోర్ విశ్లేషణలు వేరేలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌‌లో వైసీపీ ఓటమి గ్యారంటీ అని ఆయన తేల్చేశారు.

వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓటమి ఖాయమని విశ్లేషించారు. ఎన్నికల్లో తెలుగుదేశం-జనసేన కూటమిదే విజయమని చెప్పారు. అంతేకాదు జగన్ తనకు తాను రాజాగా భావిస్తున్నారని… ఆయన గెలవడం కష్టమని స్పష్టం చేశారు. అప్పు తెచ్చి అయినా.. మీకు నగదు అందజేస్తున్నానని ఆయన అనుకుంటున్నారని.. ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘేల్ మాదిరిగా ప్రజలకు డబ్బు పంపిణీ చేస్తే గెలుస్తామని భ్రమలో ఉన్నా జగన్ ఉన్నారని ప్రశాంత్ కిషోర్ అన్నారు. మాజీ సీఎం బఘేల్ వలే.. ప్రజల ఆకాంక్షలు తీర్చడానికి బదులు నియోజకవర్గాలకు ప్రొవైడర్ మోడ్‌లోనే జగన్ ఉండిపోయారని ఈ సందర్భంగా పీకే గుర్తు చేశారు… గతంలో రాజుల్లా.. తాయిలాలతోనే సరిపెట్టడం తప్పితే ఇంకా ఏం చేయలేదన్నారు. ప్రజలకు నగదు బదిలీ చేశారు తప్పితే.. ఉద్యోగాలు కల్పించడం, రాష్ట్రాభివృద్ధిపై ఆయన శ్రద్ద పెట్టలేదని ప్రశాంత్ కిషోర్ వివరించారు. ఈ కామెంట్స్ వైసీపీ నేతలకు నచ్చక ప్రశాంత్ కిశోర్ పై అక్కసుగక్కుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -