Gautam Gambhir: ఈ విషయంలో సంబంధం లేదు అని అసహనం వ్యక్తం చేస్తున్న ఆటగాళ్లు!

Gautam Gambhir: టీమిండియా మాజీ ఓపెనర్ అయిన గౌతం గంభీర్ రీసెంట్గా సీనియర్ ఆటగాళ్లని ఉద్దేశించి చేసిన కామెంట్స్ పై టీమిండియా సభ్యులు అసహనంతో ఉన్నారు. అతను చేసిన వ్యాఖ్యానాలు కేవలం జట్టులోని సీనియర్ ఆటగాళ్లే కాకుండా కోచ్ లు మరియు సహాయ సిబ్బంది కూడా తమ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గౌతమ్ మాటలను పట్టి అతను పట్టి వదరబోతు అని బిరుదు కూడా ఇచ్చారు.

 

 

విరాట్ కోహ్లీ , రోహిత్ శర్మ మరియు కేఎల్ రాహుల్‌ మాత్రమే ఆటగాళ్లు కాదు సెలెక్టర్లు ఇతరుల వైపు కూడా చూడాలి అని గంభీర్ వ్యాఖ్యానించారు. సీనియర్ ఆటగాళ్లపై స్పష్టత ఉండాలి అవసరమైతే వాళ్ళని కాదని వేరే వాళ్ళని కూడా తీసుకోవచ్చు అనే విధంగా అతను మాట్లాడాడు. పైగా చాలా దేశాలలో ఇలాగే జరుగుతుంది అని ఉదాహరణలు కూడా ఇచ్చారు.

 

సీనియర్లను జట్టులో నుంచి తొలగించినప్పుడు జరిగే రాద్ధాంతం సర్వసాధారణం అని .ఆటలో వ్యక్తుల గురించి కాకుండా జట్టు గురించి ఆలోచించాలని గంభీర్ అభిప్రాయ పడ్డాడు. వచ్చే టి20 ప్రపంచ కప్ సాధించాలి అంటే మంచి ప్రణాళికతో ముందుకు వెళ్లాలి అని సూచించారు. ఎందుకంటే మనం ఇక్కడ కాదు అక్కడికి వెళ్లి ఆడాలి అది గుర్తుపెట్టుకోవాలి. వీళ్లు సాధించలేరు అనుకుంటే సూర్య కుమార్ లాంటి యంగ్ ఆటగాళ్లు మన కల నెరవేరుస్తారు ఏమో ఎవరికి తెలుసు, అని గంభీర్ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

 

‘భారత జట్టులో ఇప్పటికే ఎన్నో మార్పులు జరిగాయి. ఒక్క సంవత్సరం కాలంలో చాలామంది ప్లేయర్స్ మారారు. ఐసీసీ టైటిల్స్ గెలవాలి అంటే స్థిరమైన జట్టు ఉండడం ఎంతో అవసరం. ప్రతి ఒక్క సీరియస్ తరువాత ప్లేయర్లకు బ్రేకులు ఇవ్వడం మంచిది కాదు. సీనియర్ ప్లేయర్స్ అయినప్పటికీ కచ్చితంగా వరుస మ్యాచ్లు ఆడాల్సిందే. అంతేకానీ ఒకటి రెండు సిరీస్ ఆడిన తర్వాత రెస్ట్ పేరుతో బ్రేక్ తీసుకోవడం మంచిది కాదు.’అన్న గంభీర్ మాటలపై సీనియర్ ఆటగాళ్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

 

ప్రస్తుతం గంభీర్ చేసిన ఈ వ్యాఖ్యలపై టీమిండియా సీనియర్ ఆటగాళ్లు తమ సహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం హాలిడే లో ఉన్న ఒక టాప్ ప్లేయర్ ఇన్ సైడ్ స్టోరీ తో మాట్లాడుతూ గంభీర్ తీరు గురించి తప్పు పట్టారు. టీంకు వ్యతిరేకంగా గంభీర్ మాట్లాడిన మాటలకు తరలి నిరాశకు గురి చేశాయి అని అన్నారు. భారత్ క్రికెట్ గాను అతను చేసిన సేవలను ఎప్పటికీ మేము గౌరవిస్తాం. అలాగే అతను కూడా మిగతా ఆటగాళ్లు అందించిన సేవలను గౌరవించాలి అని పేర్కొన్నారు.

 

అలాగే ఓ బీసీసీఐ అధికారి కూడా గంభీర్ తీరుపై నిరాశ వ్యక్తం చేశారు.’ప్రస్తుతం గంభీర్ కు టీమిండియా కు సంబంధం లేదు. ఒక అవుట్ సైడ్ గా అతను జట్టు సెటప్ లో ఏం జరుగుతుందో మాట్లాడడం సమంజసం కాదు. అతను కేవలం ఒక వదరబోతూ “అని ఆయన అన్నారు.

Related Articles

ట్రేండింగ్

తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి ప్రధానమైన కారణాలివే.. ఆ తప్పులే ముంచేశాయా?

తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి అధికారాన్ని సొంతం చేసుకుంటామని కాన్ఫిడెన్స్ తో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. 2014, 2018 ఎన్నికల్లో విజయం సాధించిన ఈ పార్టీకి 2023 ఫలితాలు మాత్రం...
- Advertisement -
- Advertisement -