Gemini Ganesan: జెమినీ గణేషన్ నిజస్వరూపం బయటపెట్టిన కూతురు.. ఏమన్నారంటే?

Gemini Ganesan: కోలీవుడ్ లెజెండరీ హీరో జెమినీ గణేషన్ గురించి మనందరికీ తెలిసిందే. ఈయన సినిమాల ద్వారా ఎంత ఫేమస్ అయ్యారో, అలాగే వ్యక్తిగత విషయాల ద్వారా కూడా అంతే ఫేమస్ అయ్యారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకున్నారు జెమినీ గణేషన్. ఇక అప్పట్లోనే అమ్మాయిల కలలో రాకుమారుడుగా కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు. గొప్ప అందంతో పాటు ఉంగరాల జుట్టు, ఒడ్డు పొడవు కూడా బాగానే ఉండేవాడు.

జెమినీ గణేష్ ని స్త్రీ లోలుడు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆయనకు ఏకంగా నాలుగు పెళ్లిళ్లు అయ్యాయి. ఇక అప్ప‌టికే పెళ్ల‌య్యి, పిల్ల‌లు ఉన్న జెమినీ ప్రేమ‌లో మ‌హాన‌టి సావిత్రి ప‌డి పెళ్లి చేసుకోవ‌డం అప్ప‌ట్లో పెద్ద సంచ‌ల‌నంగా మారింది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ విడిపోయిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే ఇటీవల జెమినీ గణేషన్ కూతురు కమలా గణేషన్ తన తండ్రి గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఈ సందర్భంగా కమలా మాట్లాడుతూ.. మా డాడీ చాలా హ్యాండ్‌ స‌మ్‌గా ఉండేవారు. ఆయ‌న హెయిర్ స్టైల్ చాలా బాగుండేది. ఆయ‌న పిల్ల‌లంద‌రిని ఎంతో ప్రేమ‌గా చూసుకునేవారు.

 

ప్ర‌తి రోజు డాడీని చూసేందుకు ఇంటికి చాలా మంది అమ్మాయిలు వ‌చ్చేవారు. ఇంట్లో అమ్మ ముందే వారంతా నాన్న మీద ప‌డి న‌న్ను పెళ్లి చేసుకో అనేవారు అని తెలిపింది కమలా గణేషన్. కొంద‌రు అయితే వేధించేసే వారు ఆమె తెలిపింది. అయితే డాడీ వాళ్లంద‌రికి త‌న‌కు పెళ్ల‌య్యి పిల్ల‌లు ఉన్నార‌ని చెప్పి మ‌రీ పంపేవార‌ని కూడా క‌మ‌లా చెప్పారు. ఇక అమ్మ సావిత్రి, డాడీ పెళ్లి చేసుకోవ‌డం విధిరాత డాడీ ఎవ‌ర్ని ఫోర్స్ చేయ‌లేదు. ఇద్ద‌రూ ఇష్ట‌ప‌డే పెళ్లి చేసుకున్నారు అని తెలిపింది క‌మ‌లా. ఇక ఆయ‌న ఏనాడు అవ‌కాశాల కోసం ఇబ్బంది ప‌డ‌లేదు. మ‌హాన‌టి సినిమాలో త‌ప్పుగా చూపించారు. బయట జరిగింది వేరు. ఆ సినిమాలో చూపించింది వేరు అని చెప్పుకొచ్చింది కమలా.

 

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -