Puja: అమ్మాయి, అబ్బాయి ఒంటరిగా పూజలు చేయకూడదా.. ఎందుకంటే?

Puja: సాధారణంగా ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడది తప్పకుండా ఉంటుంది అని అంటూ ఉంటారు. అలాగే ప్ర‌తి స్త్రీ విజయం వెనుక కూడా ఓ పురుషుడు ఉంటాడ‌ని అంటూ అంటారు. కేవలం ఈ విషయం కెరియర్ పరంగా మాత్రమే కాకుండా ఆలయాలు పూజలు యాగాలు సందర్శించినప్పుడు కూడా దంపతులిద్దరూ కలిసి ఆ పనులను చేయాలి. పూజ చేస్తున్నప్పుడు దంపతులు ఇద్దరు కలిసి పూజలో కూర్చోవాలి. ఆలయానికి వెళ్ళినప్పుడు దంపతులిద్దరూ కలిసి ఆలయానికి దేవుడు మొక్కు చెల్లించుకోవాలి.

అలా చేయడం వెనుక పురాణాలు ఉంటాయి అంటున్నారు. హిందూ పురాణాల ప్ర‌కారం స్త్రీని శ‌క్తితో పోలుస్తారు. కాబట్టి శ‌క్తి రూపంలో ఉండే స్త్రీ ప‌క్క‌న ఉండ‌గా పూజ చేస్తే ఆ పురుషునికి అన్నింటా విజ‌యం సిద్దిస్తుందది. అందుకే దంప‌తులిద్ద‌రూ క‌ల‌సి పూజ‌లు చేయాలి. దేవాల‌యాల‌ను ద‌ర్శించాల‌ని చెబుతుంటారు. దంప‌తులిద్ద‌రూ ఒక‌రి శ‌రీరంలో మ‌రొక‌రు స‌గ‌భాగం అంటారు. అంతే అర్ధనారీశ్వరుడితో సమానం. అంటే మగవారిలో సగభాగం ఆడవారు అని అర్థం. కాబట్టి భార్యాభర్తలు కష్టసుఖాల్లోనే కాకుండా పూజలు చేసేటప్పుడు ఆలయాలు వంటి పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు కూడా కలిసి చేయడం వల్ల కలిసి పాల్గొనడం వల్ల ఆ ఫలితం ఇద్దరికీ కలుగుతుంది.

 

కృత, త్రేతా, ద్వాపర యుగాల్లో చాలా మంది రాజులు త‌మ భార్య‌లు ప‌క్క‌న లేనప్పుడు వారికి చెందిన బంగారు విగ్రహాల‌తో పూజ‌లు చేసే వారు. అలాగే ఇప్పుడు కూడా భార్యాభ‌ర్త‌లిద్ద‌రూ చేయాలి. అలా చేయడం వల్ల ఆ యాగ ఫ‌లితం సంపూర్ణంగా వారికి ద‌క్కుతుందది. పెళ్లి చేసుకున్న‌ప్పుడు దంప‌తులిద్ద‌రూ అన్ని విష‌యాల్లోనూ ఇద్ద‌రూ స‌మంగా పాలు పంచుకుంటామ‌ని పంచ భూతాల సాక్షిగా ప్ర‌మాణం చేస్తారు. కాబట్టి అలాంట‌ప్పుడు పుణ్యక్షేత్రాల సంద‌ర్శ‌న‌, పూజ‌లు చేసిన‌ప్పుడు కూడా భార్య‌భర్త‌లిద్ద‌రూ పాల్గొంటేనే అది సంపూర్ణం అయి ఫ‌లితం ద‌క్కుతుంది. లేదంటే స‌గ ఫ‌ల‌మే ద‌క్కుతుంది.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -