NTR: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఏం జరిగిందంటే?

NTR: టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. గత ఏడాది ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన తారక్ ఈ సినిమాతో గ్లోబల్ స్టార్ గా మారిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ గా మారిన తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఇప్పటికే ఎన్టీఆర్ 30 సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాపై భారీగా ఆశలను పెట్టుకున్నారు ఎన్టీఆర్ అభిమానులు.

కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా తప్పకుండా బాక్సాఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ ను క్రియేట్ చేస్తుందని అభిమానులు ఎంతో నమ్మకంతో ఉన్నారు. కొరటాల శివ కూడా ఈ సినిమాతో సక్సెస్ సాధిస్తాను అన్న ధీమాతో కనిపిస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయంలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. కాగా ఎన్టీఆర్ 30 సినిమా ఒక ఐలాండ్ బ్యాక్ గ్రౌండ్ లో ఉండబోతుందని నరరూప రాక్షసులతో జూనియర్ ఎన్టీఆర్ పోరాట సన్నివేశాలు ఉండబోతున్నాయి అని ఇదివరకే కొరటాల శివ క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ప్రతి సినిమాలో ఒక ఎలిమెంట్ హైలెట్ చేస్తూ వస్తున్న కొరటాల శివ ఇందులో కూడా గ్లోబల్ పాయింట్ ను టచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాను దాదాపుగా 300 కోట్ల భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లో నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక సినిమాలో ఎన్టీఆర్ రెండు విభిన్నమైన పాత్రలో కనిపించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. అందులో ఒకే క్యారెక్టర్ ను రెండు షేడ్స్ లో చూపిస్తారేమో అని మొదట అభిమానులు భావించినప్పటికీ, తాజాగా అందిన సమాచారం ప్రకారం ఎన్టీఆర్ డబుల్ యాక్షన్ ఈ సినిమాలో హైలెట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. కాగా ఇదివరకే ఎన్టీఆర్ కొన్ని సినిమాలలో డబుల్ యాక్షన్ లో కనిపించినప్పటికీ అవి పెద్దగా వర్కౌట్ కాలేదు. కానీ ఇప్పుడు ఎన్టీఆర్ రెండు పాత్రలను కొరటాల శివ పవర్ ఫుల్ గా ప్రజెంట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇందులో ఎన్టీఆర్ కొడుకు పాత్రలోనే కాకుండా తండ్రి పాత్రలో కూడా నటించబోతున్నాడట.

Related Articles

ట్రేండింగ్

AP Roads: ఏపీలో రోడ్ల పరిస్థితిని చూపించి ఓట్లు అడిగే దమ్ముందా.. వైసీపీ నేతల దగ్గర జవాబులున్నాయా?

AP Roads:  ఒక రాష్ట్రం అభివృద్ధి బాటలో నడవాలి అంటే ముందుగా ఆ రాష్ట్రంలో మౌలిక సదుపాయాలన్నీ కూడా సక్రమంగా ఉండాలి మౌలిక సదుపాయాలు అంటే రోడ్లు కరెంట్ నీరు వంటి వాటివి...
- Advertisement -
- Advertisement -