Mokshagna Teja: నందమూరి అభిమానులు చొక్కాలు చింపుకునే శుభవార్తిదే.. అభిమానులు మీసం మెలేసేలా?

Mokshagna Teja: నందమూరి అభిమానులు ఎప్పటినుంచో బాలయ్య బాబు తనయుడు మోక్షజ్ఞ నీకోసం ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటివరకు సోషల్ మీడియాలో మోక్షజ్ఞ ఎంట్రీ పై వందల సంఖ్యలో ఆర్టికల్స్ గాసిప్స్ వినిపించాయి. కానీ అవన్నీ ఒట్టి రూమర్స్ గానే మిగిలిపోయాయి. అయితే మోక్షజ్ఞ ఎంట్రీ పై వార్తలు వినిపించిన ప్రతిసారి అభిమానులు నిజమే అని నమ్ముతూ వచ్చారు.

ఇది ఇలా ఉంటే తాజాగా మరోసారి మోక్షజ్ఞ ఎంట్రీ పై తెలుగు సినిమా ఇండస్ట్రీలో వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. కాగా నందమూరి నరసింహ హీరో బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీ లీల బాలకృష్ణ కూతురిగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా షూటింగ్ సెట్స్ లో బాలయ్య బాబు కొడుకు మోక్షజ్ఞ కనిపించారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

అయితే మోక్షజ్ఞ ఈ సినిమా సెట్స్ లో ఊరికే టైం పాస్ చేయడానికి రాలేదని ఈ సినిమా ద్వారా ఓ స్పెషల్ కేమియో రోల్ లో కనిపించబోతున్నాడని తన తండ్రి సినిమాతోనే తన టాలీవుడ్ ఎంట్రీ ఉండాలని బలంగా ఫిక్స్ అయిన మోక్షజ్ఞ ఈ సినిమా ద్వారా ఎంట్రీ ఇవ్వబోతున్నాడని కేవలం ఈ సినిమాలో రెండంటే రెండు నిమిషాల పాత్రలో మోక్షజ్ఞ నటించబోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఒకవేళ ఈ వార్త కనుక నిజమైతే నందమూరి అభిమానులకు ఇంతకంటే చక్కని శుభవార్త మరొకటి ఉండదు అని చెప్పవచ్చు.. ఇప్పటికే ఈ ప్రాజెక్టు పై భారీగా అంచనాలు నెలకొన్నాయి. దానికి తోడు మోక్షజ్ఞ ఈ సినిమాలో నటిస్తున్నాడు అంటూ వార్తలు వినిపించడంతో ఆ అంచనాలు మరింత పెరిగాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -