Mokshagna Teja: ఓవర్ కాన్ఫిడెన్స్ తో మోక్షజ్ఞ సినీ ఎంట్రీ.. సక్సెస్ అవుతాడా?

Mokshagna Teja: ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది వారసులు తమ వారసత్వాన్ని కొనసాగిస్తూ ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు.ఇక ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచిది సక్సెస్ అందుకు ఉన్నటువంటి నందమూరి బాలకృష్ణ సినీ వారసుడి కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.ఈ క్రమంలోనే బాలకృష్ణ ఎప్పుడు తన కొడుకు సినిమా ఎంట్రీ గురించి చెబుతారా అంటూ అభిమానులు చాలా సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నారని చెప్పాలి.

ఇలా మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులు ఎదురు చూసి చివరికి ఆశలు కూడా వదులుకుంటున్న తరుణంలో మరోసారి మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ గురించి వార్తలు మొదలయ్యాయి. ఇక ఈ ఏడాది కచ్చితంగా మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఉండబోతుంది అంటూ బాలయ్య కూడా ధీమా వ్యక్తం చేశారు. జూన్ పదవ తేదీ బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ గురించి ఏదైనా అప్డేట్ ఉంటుందేమోనని అందరూ భావించారు. కానీ బాలకృష్ణ నుంచి ఎలాంటి అప్డేట్ రాకపోవడం గమనార్హం.

ఈ విధంగా బాలకృష్ణ మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోయినా మోక్షజ్ఞ మాత్రం తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా చేసినటువంటి పోస్ట్ మాత్రం నందమూరి అభిమానులను సంతోషానికి గురిచేస్తుంది.ఒకప్పుడు ఎంతో బొద్దుగా ఉండే మోక్షజ్ఞ చాలా స్లిమ్ అయ్యారని చాలా అందంగా కనిపిస్తున్నారని చెప్పాలి అంతేకాకుండా ఈయన తన న్యూ లుక్ కి సంబంధించిన ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ….

గర్జించడానికి రెడీ.. డేట్‌ గుర్తు పెట్టుకోండి అంటూ 6-9-2024 డేట్‌ను వేశారు. అంటే నందమూరి మోక్షజ్ఞ సినిమా కంఫర్మ్ అయిందని వచ్చేయడాది సెప్టెంబర్ ఆరవ తేదీ సినిమా విడుదలకు సిద్ధం కాబోతోంది అంటూ భావిస్తున్నారు. ఇదే కనుక నిజమైతే మరి కొద్ది రోజులలో ఈయన సినిమా షూటింగ్ కూడా ప్రారంభం కాబోతుందని తెలుస్తుంది.ఇలా గర్జించడానికి రెడీ అంటూ ఈయన చెప్పడంతో మోక్షజ్ఞ చాలా కాన్ఫిడెన్స్ తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్నారంటూ పలువురు ఈయన పోస్ట్ పై చర్చలు జరుపుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -